Title (Indic)చెప్పినట్టెల్లాఁ జేసి చేకొని మన్నించుఁగాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చెప్పినట్టెల్లాఁ జేసి చేకొని మన్నించుఁగాక వొప్పుగ నీపొందు మాని వూరకుండఁగలఁడా (॥॥) కామించి నీపై వలవు గలిగిన రమణుఁడు యేమే నీమాటకు యెదురాడీనా గోమున నీరాకలే కోరుక వుండె నిందాఁకా భామరో యీవేళను పరాకుసేసీనా (॥॥) పలుమారు నీకును బాసలిచ్చిన విభుఁడు తలఁచుకొనక యిట్టె తక్కించీనా యెలమి నీకాఁగిటికి యెదురు చూచె నిందాఁ కా తలకొని యేలుఁ గాకా తామరచీనా (॥॥) చిత్తగించి నీపాలిటి శ్రీ వేంకటేశుఁడు కొత్తగా భోగించుఁ గాక గుట్టు చూపీనా బత్తినేసి బాగాలిచ్చె నిందాఁకా హత్తి రతిఁ జొక్కించుఁగా కారడి బెట్టినా English(||pallavi||) sĕppinaṭṭĕllām̐ jesi segŏni manniṁchum̐gāga vŏppuga nībŏṁdu māni vūraguṁḍam̐galam̐ḍā (||||) kāmiṁchi nībai valavu galigina ramaṇum̐ḍu yeme nīmāḍagu yĕdurāḍīnā gomuna nīrāgale koruga vuṁḍĕ niṁdām̐kā bhāmaro yīveḽanu parāgusesīnā (||||) palumāru nīgunu bāsalichchina vibhum̐ḍu talam̐sugŏnaga yiṭṭĕ takkiṁchīnā yĕlami nīgām̐giḍigi yĕduru sūsĕ niṁdām̐ kā talagŏni yelum̐ gāgā tāmarasīnā (||||) sittagiṁchi nībāliḍi śhrī veṁkaḍeśhum̐ḍu kŏttagā bhogiṁchum̐ gāga guṭṭu sūbīnā battinesi bāgālichchĕ niṁdām̐kā hatti radim̐ jŏkkiṁchum̐gā kāraḍi bĕṭṭinā