Title (Indic)చెప్పరే బుద్దులు నాకుఁ జెలులాల మిమ్ము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చెప్పరే బుద్దులు నాకుఁ జెలులాల మిమ్ము మెప్పించుదాఁకా నుంటి మీఁదిమాట లేఁటివే (॥చెప్పి॥) కన్నులఁ దప్పక చూచి కవకవ నవ్వివాఁడు చన్నులపై నునుఁ గొంగు జారదియ్య సన్నపుఁ జెమటతోడ సారె నిట్టూర్పులతోడ మిన్నకె నేనున్న దాన మీఁదిమాట లేఁటివే (॥చెప్పి॥) వూరకే వద్దఁ గూచుండి వొళ్లి మీఁదఁ జెయివేసి ఖారపుఁదురుము వట్టి భ్రమయించఁగా ఆరీతికరఁగులతో నట్టే నివ్వెరగులతో మేర మీరకున్న దాన మీఁది మాట లేఁటివే (॥చెప్పి॥) గక్కన నాచెక్కు నొక్కి కప్పురపుమోవి ఇచ్చి యెక్కువ శ్రీవేంకటేశుఁడిటు గూడఁగా ముక్కు మీఁది వేలితోడ ముంచి సంతసాలతోడ మిక్కుటమై వున్నదాన మీఁదిమాట లేఁటివే English(||pallavi||) sĕppare buddulu nāgum̐ jĕlulāla mimmu mĕppiṁchudām̐kā nuṁṭi mīm̐dimāḍa lem̐ṭive (||sĕppi||) kannulam̐ dappaga sūsi kavagava navvivām̐ḍu sannulabai nunum̐ gŏṁgu jāradiyya sannabum̐ jĕmaḍadoḍa sārĕ niṭṭūrbuladoḍa minnagĕ nenunna dāna mīm̐dimāḍa lem̐ṭive (||sĕppi||) vūrage vaddam̐ gūsuṁḍi vŏḽli mīm̐dam̐ jĕyivesi khārabum̐durumu vaṭṭi bhramayiṁcham̐gā ārīdigaram̐gulado naṭṭe nivvĕragulado mera mīragunna dāna mīm̐di māḍa lem̐ṭive (||sĕppi||) gakkana nāsĕkku nŏkki kappurabumovi ichchi yĕkkuva śhrīveṁkaḍeśhum̐ḍiḍu gūḍam̐gā mukku mīm̐di velidoḍa muṁchi saṁtasāladoḍa mikkuḍamai vunnadāna mīm̐dimāḍa lem̐ṭive