Title (Indic)చెప్పఁగ సిగ్గులువడే విదే చేఁతలు నేమే కంటిమి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చెప్పఁగ సిగ్గులువడే విదే చేఁతలు నేమే కంటిమి ఇప్పుడు గా మా కోరిక లిటు ఫలియించినది (॥॥) చెక్కుల జారినచెమటలు చిందరవందరకురులను గక్కన నవిరిబాగులు కంటిమి నీకిపుడు మొక్కలమగుకన్నెవు నీమొలక కుచంబుల మీఁదట ఇక్కువలంటినచందురు లెక్కడివే నీకు (॥॥) మోమునఁ దేరేటికళలును ముంచిన కన్నుల తేటలే కామించిన భాగ్యంబులు గలిగెనే నీకిపుడు నేమే చెప్పిన నొల్లవు నీయంతనే నీ కిప్పుడు యీ మోహపుటసురుసురులు యెక్కడివే నీకు (॥॥) సదమదమగురతియలపులు సారెకు సారెకు వెరగులు నిదురలు మిక్కిలి మించెను నేఁడే నీ కిపుడు కదియుచు శ్రీ వేంకటపతికాఁగిటఁ గూడఁగఁ గలిగెను ఇదివో ఇంతకముందర యెక్కడివే నీకు English(||pallavi||) sĕppam̐ga sigguluvaḍe vide sem̐talu neme kaṁṭimi ippuḍu gā mā koriga liḍu phaliyiṁchinadi (||||) sĕkkula jārinasĕmaḍalu siṁdaravaṁdaragurulanu gakkana naviribāgulu kaṁṭimi nīgibuḍu mŏkkalamagugannĕvu nīmŏlaga kusaṁbula mīm̐daḍa ikkuvalaṁṭinasaṁduru lĕkkaḍive nīgu (||||) momunam̐ dereḍigaḽalunu muṁchina kannula teḍale kāmiṁchina bhāgyaṁbulu galigĕne nīgibuḍu neme sĕppina nŏllavu nīyaṁtane nī kippuḍu yī mohabuḍasurusurulu yĕkkaḍive nīgu (||||) sadamadamaguradiyalabulu sārĕgu sārĕgu vĕragulu niduralu mikkili miṁchĕnu nem̐ḍe nī kibuḍu kadiyusu śhrī veṁkaḍabadigām̐giḍam̐ gūḍam̐gam̐ galigĕnu idivo iṁtagamuṁdara yĕkkaḍive nīgu