Title (Indic)చెలివంటా నుండితిమి చెల్లుఁబో యిన్నాళ్ళు నిన్ను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చెలివంటా నుండితిమి చెల్లుఁబో యిన్నాళ్ళు నిన్ను చలిమి బలి మాడేవు సవతివటే (॥చెలి॥) ఆతనితో మొకమోట మంతే నీకుఁ గలిగితే నీతితో నెడమాటలు నేనే యాడేనే పోతరించి యెందుకై నాఁ బూనుక వచ్చేవు నీవు ఆతలను నీ వొకఆలవటవే (॥చెలి॥) నిచ్చాఁ బిలుచుకరాను నీవు సిగ్గువడితేను నెచ్చెలిరో పతిఁ జూడ నేనే వచ్చేనే అచ్చమైనదొరసానివై నాకు బుద్ది చెప్పేవు పెచ్చు వెరిగేవు నీవూఁ బెండ్లా డితివటవే (॥చెలి॥) మక్కువ నీ కతనికి మతకములు గలితే వొక్కటై యాతనిఁ బాయ కొద్ద నుండేనే యిక్కువ శ్రీవేంకటేశుఁ డిట్టె నన్నుఁ గూడె మిక్కిలి నవ్వే వతని మేనదానవటవే English(||pallavi||) sĕlivaṁṭā nuṁḍidimi sĕllum̐bo yinnāḽḽu ninnu salimi bali māḍevu savadivaḍe (||sĕli||) ādanido mŏgamoḍa maṁte nīgum̐ galigide nīdido nĕḍamāḍalu nene yāḍene podariṁchi yĕṁdugai nām̐ būnuga vachchevu nīvu ādalanu nī vŏgaālavaḍave (||sĕli||) nichchām̐ bilusugarānu nīvu sigguvaḍidenu nĕchchĕliro padim̐ jūḍa nene vachchene achchamainadŏrasānivai nāgu buddi sĕppevu pĕchchu vĕrigevu nīvūm̐ bĕṁḍlā ḍidivaḍave (||sĕli||) makkuva nī kadanigi madagamulu galide vŏkkaḍai yādanim̐ bāya kŏdda nuṁḍene yikkuva śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ mikkili navve vadani menadānavaḍave