Title (Indic)సమ్మతిలఁ జెప్పేవు సారెసారెకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) సమ్మతిలఁ జెప్పేవు సారెసారెకు వుమ్మడి మా మనసంకా నొడఁబడీనా (॥సమ్మ॥) అన్నిటా నీవెంత నన్ను ఆసలఁబెట్టినాను యెన్ని లేవు నీగుణాలు యెఱిఁగినవే కన్నుల దొల్లె నేము కంటిమి నీసరితలు వున్నతి నామనసిది వొడఁబడీనా (॥సమ్మ॥) రవ్వలుగ నీవెంత రతికిఁ బిలిచినాను యివ్వల నీచేఁతలు యెఱిఁగినవే తవ్వి తలకెత్తేవు నీతగవులు మాకును వువ్విళ్లూర మామనసు వొడఁబడీనా (॥సమ్మ॥) సిగ్గువడక నీవెంత చెక్కులు నొక్కి నాను యేగ్గులేని నీపొందు లెఱిఁగినవే నిగ్గున శ్రీవేంకటేశ నేఁడె నన్ను నేలితివి వొగ్గి యింక వేరేమనసొవొడఁబడీనా English(||pallavi||) sammadilam̐ jĕppevu sārĕsārĕgu vummaḍi mā manasaṁkā nŏḍam̐baḍīnā (||samma||) anniḍā nīvĕṁta nannu āsalam̐bĕṭṭinānu yĕnni levu nīguṇālu yĕṟim̐ginave kannula dŏllĕ nemu kaṁṭimi nīsaridalu vunnadi nāmanasidi vŏḍam̐baḍīnā (||samma||) ravvaluga nīvĕṁta radigim̐ bilisinānu yivvala nīsem̐talu yĕṟim̐ginave tavvi talagĕttevu nīdagavulu māgunu vuvviḽlūra māmanasu vŏḍam̐baḍīnā (||samma||) sigguvaḍaga nīvĕṁta sĕkkulu nŏkki nānu yegguleni nībŏṁdu lĕṟim̐ginave nigguna śhrīveṁkaḍeśha nem̐ḍĕ nannu nelidivi vŏggi yiṁka veremanasŏvŏḍam̐baḍīnā