Title (Indic)సకలముఁ జదివిన శాస్త్రము లెఱిఁగిన WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) సకలముఁ జదివిన శాస్త్రము లెఱిఁగిన శుకధ్రువాదు లిటు చూపినది (॥సక॥) భవభవములకును ప్రకృతులు వేరే భువి నామరూపములు వేరే యివల నీదాస్యం జెప్పుడు నొకటే కవిసిన నీ మాయఁ గడిచినది (॥సక॥) మతము మతమునకు మార్గము వేరే అతిసంశయములు అవి వేరే గతి నీ శరణము గలిగిన దొకటే యితవగు మోక్షం బిచ్చేది (॥సక॥) జాతి జాతి యాచారము వేరే ఆతల మోక్షంబది యొకటే శ్రీతరుణీశ్వర శ్రీవేంకటేశ్వర చేత మాగురుఁడు చెప్పినది English(||pallavi||) sagalamum̐ jadivina śhāstramu lĕṟim̐gina śhugadhruvādu liḍu sūbinadi (||saga||) bhavabhavamulagunu prakṛtulu vere bhuvi nāmarūbamulu vere yivala nīdāsyaṁ jĕppuḍu nŏgaḍe kavisina nī māyam̐ gaḍisinadi (||saga||) madamu madamunagu mārgamu vere adisaṁśhayamulu avi vere gadi nī śharaṇamu galigina dŏgaḍe yidavagu mokṣhaṁ bichchedi (||saga||) jādi jādi yāsāramu vere ādala mokṣhaṁbadi yŏgaḍe śhrīdaruṇīśhvara śhrīveṁkaḍeśhvara seda māgurum̐ḍu sĕppinadi