Title (Indic)సకలపురాణములు చాటి నినుఁ బొగడఁగా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) సకలపురాణములు చాటి నినుఁ బొగడఁగా తకమకలుగా నల్పార్థము చెప్పఁదగునా (॥కల॥) నిను నిర్గుణు డనేటి నీచజాతులయందు యెనయు దుర్గుణము దా నెంతో కనకంబు నిను మనుచు కారునాయంబులను యెనలేనిదుర్వాదుల నేమనఁగఁగలము (॥కల॥) నీవె తా మనుకొనేటి నిందితాత్ములు దాము కావించుద్రోహంబు కడమా దావతులఁ దనుఁగన్నతల్లి గొడ్డనిపల్కు దేవతానిందకులఁ దెలుపంగ వశమా (॥కల॥) అమరుసర్గము మిథ్య యనుశూన్యభాషులకు తమితోడ భ్రమ యేల తరగు తమగురువు శాస్త్రంబు తామె కల్లనఁ గాను క్రమబుద్ధి శ్రీవెంకటనాథ యిత్తువా English(||pallavi||) sagalaburāṇamulu sāḍi ninum̐ bŏgaḍam̐gā tagamagalugā nalbārdhamu sĕppam̐dagunā (||kala||) ninu nirguṇu ḍaneḍi nīsajādulayaṁdu yĕnayu durguṇamu dā nĕṁto kanagaṁbu ninu manusu kārunāyaṁbulanu yĕnalenidurvādula nemanam̐gam̐galamu (||kala||) nīvĕ tā manugŏneḍi niṁdidātmulu dāmu kāviṁchudrohaṁbu kaḍamā dāvadulam̐ danum̐gannadalli gŏḍḍanibalgu devadāniṁdagulam̐ dĕlubaṁga vaśhamā (||kala||) amarusargamu mithya yanuśhūnyabhāṣhulagu tamidoḍa bhrama yela taragu tamaguruvu śhāstraṁbu tāmĕ kallanam̐ gānu kramabuddhi śhrīvĕṁkaḍanātha yittuvā