Title (Indic)రావే యీతని కడకు రమణి నేఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) రావే యీతని కడకు రమణి నేఁడు నీవు నాతఁడుఁ బొందైతే నెమ్మది నుండుదురు (॥రావే॥) చేరి తనరమణుఁడే చెంకొంటేఁ జాలుఁగాక సారె సారె దూరనేల సవతులను ఆరితేరి యాతఁడే మాటాడితేఁ జాలుఁగాక వీరిడై కోపించనేల వెడచిలుకలను (॥రావే॥) అక్కరగలవిభుఁడు యాసిచ్చితేఁ జాలుఁగాక కక్కసించనేల చెలికత్తియలను చొక్కి తనది క్కాతఁడు చూచితేఁ జాలుఁగాక గక్కన జంకించనేల కంతునిబాణాలను (॥రావే॥) అడరి శ్రీవేంకటేశుఁ డబ్బితేఁ జాలుఁగాక తడవనేల పెంచినదాదులను యెడయ కింతలో వచ్చి యాతఁడే నిన్నుఁగూడె కడుసగినాలు చూడఁగానేల యనులను English(||pallavi||) rāve yīdani kaḍagu ramaṇi nem̐ḍu nīvu nādam̐ḍum̐ bŏṁdaide nĕmmadi nuṁḍuduru (||rāve||) seri tanaramaṇum̐ḍe sĕṁkŏṁṭem̐ jālum̐gāga sārĕ sārĕ dūranela savadulanu ārideri yādam̐ḍe māḍāḍidem̐ jālum̐gāga vīriḍai kobiṁchanela vĕḍasilugalanu (||rāve||) akkaragalavibhum̐ḍu yāsichchidem̐ jālum̐gāga kakkasiṁchanela sĕligattiyalanu sŏkki tanadi kkādam̐ḍu sūsidem̐ jālum̐gāga gakkana jaṁkiṁchanela kaṁtunibāṇālanu (||rāve||) aḍari śhrīveṁkaḍeśhum̐ ḍabbidem̐ jālum̐gāga taḍavanela pĕṁchinadādulanu yĕḍaya kiṁtalo vachchi yādam̐ḍe ninnum̐gūḍĕ kaḍusaginālu sūḍam̐gānela yanulanu