Title (Indic)పొలఁతులే వలపుల పుట్టుగుల పొలములు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) పొలఁతులే వలపుల పుట్టుగుల పొలములు తెలియఁగ నెట్టువచ్చు దేవుఁడే యెఱుఁగును (॥పొలఁ॥) సొలపుఁగన్నులు మించుఁజూపులవిత్తనములు లలి దంతములు నవ్వులమొలకలు పలుచని పెదవుల పలుకుల చిగురులు తళుకుఁ జెక్కులు సొంపుఁగళల మారాకులు (॥పొలఁ॥) బరయుఁ జేతులు రతిఁ బెనగొనే తీగెలు కరములు చేఁతల కంగపు విరులు సరుస జన్నులు మంచి జవ్వనపుఁ గాయలు సరవిఁ జక్కఁదనాల సంసారపు పంటలు (॥పొలఁ॥) కటిసొబగులు రతికాణాచి కణజాలు కుటిలకుంతలాలే కొమ్మలబాగు ఇటువలె శ్రీవేంకటేశ్వరుని వేడుకలు విటవిటీ జనులందు వెల పై నీకతలు English(||pallavi||) pŏlam̐tule valabula puṭṭugula pŏlamulu tĕliyam̐ga nĕṭṭuvachchu devum̐ḍe yĕṟum̐gunu (||pŏlam̐||) sŏlabum̐gannulu miṁchum̐jūbulavittanamulu lali daṁtamulu navvulamŏlagalu palusani pĕdavula palugula sigurulu taḽugum̐ jĕkkulu sŏṁpum̐gaḽala mārāgulu (||pŏlam̐||) barayum̐ jedulu radim̐ bĕnagŏne tīgĕlu karamulu sem̐tala kaṁgabu virulu sarusa jannulu maṁchi javvanabum̐ gāyalu saravim̐ jakkam̐danāla saṁsārabu paṁṭalu (||pŏlam̐||) kaḍisŏbagulu radigāṇāsi kaṇajālu kuḍilaguṁtalāle kŏmmalabāgu iḍuvalĕ śhrīveṁkaḍeśhvaruni veḍugalu viḍaviḍī janulaṁdu vĕla pai nīgadalu