Title (Indic)పొద్దొక వన్నెలవలెఁ బొదలీని చూడఁగానే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) పొద్దొక వన్నెలవలెఁ బొదలీని చూడఁగానే వద్దనుండీఁ దలపోయవచ్చునా యీ దేవుని (॥పొద్దొక॥) అల్ల వాఁడే జలకము లాడీని దేవుఁడు చల్లని పన్నీటివాసన మించఁగా తొల్లిటి జడివానలతోడి యశోకమువలె వెల్లివిరై వున్నవాఁడు వింత వింతరీతుల (॥పొద్దొక॥) తొప్పఁదోఁగి తిరుమేనుతో మించుకొనీ నితఁడు కప్పురపు బిండిచేతఁ గాఁక దీరఁగా వుప్పొడిఁ దోఁగిన కల్పభూజము కొలువువలె ముప్పిరి నిలుచున్నాఁడు మోహనాకారము (॥పొద్దొక॥) తట్టుపుణుఁ గలఁదీని తగు శ్రీవేంకటేశుఁడు వొట్టిన యలమేల్మంగ వుర మెక్కఁగా తొట్టిన బంగారుయేరుతోడి సముద్రునివలె గట్టియై సంపదలను గంభీరమునను English(||pallavi||) pŏddŏga vannĕlavalĕm̐ bŏdalīni sūḍam̐gāne vaddanuṁḍīm̐ dalaboyavachchunā yī devuni (||pŏddŏga||) alla vām̐ḍe jalagamu lāḍīni devum̐ḍu sallani pannīḍivāsana miṁcham̐gā tŏlliḍi jaḍivānaladoḍi yaśhogamuvalĕ vĕllivirai vunnavām̐ḍu viṁta viṁtarīdula (||pŏddŏga||) tŏppam̐dom̐gi tirumenudo miṁchugŏnī nidam̐ḍu kappurabu biṁḍisedam̐ gām̐ka dīram̐gā vuppŏḍim̐ dom̐gina kalbabhūjamu kŏluvuvalĕ muppiri nilusunnām̐ḍu mohanāgāramu (||pŏddŏga||) taṭṭubuṇum̐ galam̐dīni tagu śhrīveṁkaḍeśhum̐ḍu vŏṭṭina yalamelmaṁga vura mĕkkam̐gā tŏṭṭina baṁgāruyerudoḍi samudrunivalĕ gaṭṭiyai saṁpadalanu gaṁbhīramunanu