Title (Indic)ఓరుచుక ఇన్నిఁటికి నూరకుండుటే మేలు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఓరుచుక ఇన్నిఁటికి నూరకుండుటే మేలు యే రీతి వంచుకోవచ్చు నిటు నిన్ను విభుఁడా (॥ఓరు॥) చందమామగుటకలు సారె నీ మంచితనాలు పందెమాడే చెరకులు పనులు నీవి సందెకాడమఱఁగులు చక్కని నీ చేఁతలు యెందుకని దూరేము ఇఁక నిన్ను విభుఁడా (॥ఓరు॥) యెండమావులనీళ్లు ఇటు నీతో సరసాలు వండవండనట్లు నీవలపులెల్లా పండినబూరుగులు నీపచ్చిదేరే సిగ్గులు చండిపెట్టనేల నిన్ను చలమరివిభుఁడా (॥ఓరు॥) తంగేటిపైజున్నులు తచ్చన నీ పొందులు ముంగిటినిధానాలు మోవితేనెలు చెంగటఁ గూడితి విట్టె శ్రీవేంకటేశుఁడు నన్ను పంగించనేల నిన్ను పాయరాని విభుఁడా English(||pallavi||) orusuga innim̐ṭigi nūraguṁḍuḍe melu ye rīdi vaṁchugovachchu niḍu ninnu vibhum̐ḍā (||oru||) saṁdamāmaguḍagalu sārĕ nī maṁchidanālu paṁdĕmāḍe sĕragulu panulu nīvi saṁdĕgāḍamaṟam̐gulu sakkani nī sem̐talu yĕṁdugani dūremu im̐ka ninnu vibhum̐ḍā (||oru||) yĕṁḍamāvulanīḽlu iḍu nīdo sarasālu vaṁḍavaṁḍanaṭlu nīvalabulĕllā paṁḍinabūrugulu nībachchidere siggulu saṁḍibĕṭṭanela ninnu salamarivibhum̐ḍā (||oru||) taṁgeḍibaijunnulu tachchana nī pŏṁdulu muṁgiḍinidhānālu movidenĕlu sĕṁgaḍam̐ gūḍidi viṭṭĕ śhrīveṁkaḍeśhum̐ḍu nannu paṁgiṁchanela ninnu pāyarāni vibhum̐ḍā