Title (Indic)ఊరకున్న వానిమీఁద నుడుకులు గట్టేమా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఊరకున్న వానిమీఁద నుడుకులు గట్టేమా దారదప్పక తనంత తానుండరాదా (॥ఊర॥) చేయెత్తి మొక్కేటివాఁడు చేరి వేడుకొనేవాఁడు సేయరాని పనులెల్లాఁ జేయనేఁటికే ఆయాలు ముట్టేటివాఁడు ఆనలు వెట్టేటివాఁడు పాయపు సతులతోను పందేలాడనేఁటికే (॥ఊర॥) అలుకలు దిద్దేవాఁడు ఆసలఁ బెట్టేవాఁడు చెలుము లెక్కడనైనా సేయనేఁటికే పిలువ వచ్చేటివాఁడు ప్రియాలు చెప్పేటివాఁడు చలివాసి గొల్లెతల చన్నులంట నేఁటికే (॥ఊర॥) కప్పుర మిచ్చేటివాఁడు కాఁగిటఁ గూడేటివాఁడు చొప్పులఁ బరకాంతలఁ జూడనేఁటికే ఇప్పుడు శ్రీ వేంకటేశుఁ డింత నన్నేలినవాఁడు కుప్పలుగా నింతులను కూడ పెట్టనేఁటికే English(||pallavi||) ūragunna vānimīm̐da nuḍugulu gaṭṭemā dāradappaga tanaṁta tānuṁḍarādā (||ūra||) seyĕtti mŏkkeḍivām̐ḍu seri veḍugŏnevām̐ḍu seyarāni panulĕllām̐ jeyanem̐ṭige āyālu muṭṭeḍivām̐ḍu ānalu vĕṭṭeḍivām̐ḍu pāyabu saduladonu paṁdelāḍanem̐ṭige (||ūra||) alugalu diddevām̐ḍu āsalam̐ bĕṭṭevām̐ḍu sĕlumu lĕkkaḍanainā seyanem̐ṭige piluva vachcheḍivām̐ḍu priyālu sĕppeḍivām̐ḍu salivāsi gŏllĕdala sannulaṁṭa nem̐ṭige (||ūra||) kappura michcheḍivām̐ḍu kām̐giḍam̐ gūḍeḍivām̐ḍu sŏppulam̐ baragāṁtalam̐ jūḍanem̐ṭige ippuḍu śhrī veṁkaḍeśhum̐ ḍiṁta nannelinavām̐ḍu kuppalugā niṁtulanu kūḍa pĕṭṭanem̐ṭige