Title (Indic)నిక్కము నేఁడు మా పొందు నీకు వలెనా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నిక్కము నేఁడు మా పొందు నీకు వలెనా చక్కని విభుఁడ యింత చవి వుట్టీనా (॥నిక్కము॥) మనసు దెలసి నాతో మాట లాడే విప్పు డిట్టే తనిసి నేఁ డైన నీచిత్తము వచ్చెనా చెనకి నామీఁదఁ దెచ్చి చేయి వేసే వప్పిటిని వెనకముందరి బుద్ది విచారించుకొంటావా (॥నిక్కము॥) నయగారమును మాతో నవ్వఁ జూచే విప్పు డిట్టే జయ మైన సిగ్గు దేరి చలి వాసెనా ప్రియపడి నన్నుఁ గడు పేరుకొని పిలిచేవు క్రియతో నీ కింతపని కిమ్ములఁ గలిగెనా (॥నిక్కము॥) చొక్కుచు నా మోముదిక్కు చూచేవు సారె సారె పుక్కటై నీలోని వలపులు రేగెనా యిక్కు వంటి శ్రీవెంకటేశ నన్ను గూడితివి దిక్కుల నీగుణములు తిద్దుకొంటివా English(||pallavi||) nikkamu nem̐ḍu mā pŏṁdu nīgu valĕnā sakkani vibhum̐ḍa yiṁta savi vuṭṭīnā (||nikkamu||) manasu dĕlasi nādo māḍa lāḍe vippu ḍiṭṭe tanisi nem̐ ḍaina nīsittamu vachchĕnā sĕnagi nāmīm̐dam̐ dĕchchi seyi vese vappiḍini vĕnagamuṁdari buddi visāriṁchugŏṁṭāvā (||nikkamu||) nayagāramunu mādo navvam̐ jūse vippu ḍiṭṭe jaya maina siggu deri sali vāsĕnā priyabaḍi nannum̐ gaḍu perugŏni pilisevu kriyado nī kiṁtabani kimmulam̐ galigĕnā (||nikkamu||) sŏkkusu nā momudikku sūsevu sārĕ sārĕ pukkaḍai nīloni valabulu regĕnā yikku vaṁṭi śhrīvĕṁkaḍeśha nannu gūḍidivi dikkula nīguṇamulu tiddugŏṁṭivā