Title (Indic)నేనేల తనునాడె నేఁడు గొత్తలా నాకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నేనేల తనునాడె నేఁడు గొత్తలా నాకు తేనెగారే తన మోవి దిష్టమున్న దనవే (॥నేనే॥) తెల్లని తనకన్నులు దిమ్మరి జాగరముల నెల్లవారుఁ జూడఁజూడ నెఱ్ఱనాయను యెల్లిదము లాడేనంటా నెవ్వరిఁ గోపగించీనె చల్లని తనచేఁతే విచారించుకొమ్మనవే (॥నేనే॥) పాలుగారే తనమోము భామలతో సాములను వాలాయముగా నిదివో వసివాడెను గేలితో నేఁజూచేనంటా కేరడ మే లాడీనె తేలింపుఁ దనగుణమే తెలుసుకొమ్మనవే (॥నేనే॥) జిగిగొన్న తనమేను చెప్పరాని చేఁతలను వెగటుఁ జెమట లుబ్బి వింతలాయను నగి శ్రీవెంకటేశుఁడు నన్నుఁ గూడె నింతలోనె మగటిమి నింక నిట్టె మన్నించుమనవే English(||pallavi||) nenela tanunāḍĕ nem̐ḍu gŏttalā nāgu tenĕgāre tana movi diṣhṭamunna danave (||nene||) tĕllani tanagannulu dimmari jāgaramula nĕllavārum̐ jūḍam̐jūḍa nĕṭranāyanu yĕllidamu lāḍenaṁṭā nĕvvarim̐ gobagiṁchīnĕ sallani tanasem̐te visāriṁchugŏmmanave (||nene||) pālugāre tanamomu bhāmalado sāmulanu vālāyamugā nidivo vasivāḍĕnu gelido nem̐jūsenaṁṭā keraḍa me lāḍīnĕ teliṁpum̐ danaguṇame tĕlusugŏmmanave (||nene||) jigigŏnna tanamenu sĕpparāni sem̐talanu vĕgaḍum̐ jĕmaḍa lubbi viṁtalāyanu nagi śhrīvĕṁkaḍeśhum̐ḍu nannum̐ gūḍĕ niṁtalonĕ magaḍimi niṁka niṭṭĕ manniṁchumanave