Title (Indic)నీవల్ల దోసము లేదు నేనే వయోమదమున WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నీవల్ల దోసము లేదు నేనే వయోమదమున సేవలు సేయక గుట్టు సేసితిఁగాని (॥నీవ॥) చనవెల్లా నిచ్చితివి సముకాన నీవు నా మనసులోనిదే కడుమంకుగాని పెనగితి వింతేసి ప్రియపడి, నేనే నీకు చెనకజాలక బిగిసితిగాని (॥నీవ॥) సిగ్గులెల్ల దేర్చితివి చేయి వట్టి నీవైతే వెగ్గళించి విదిలించి వేసితిగాని దగ్గరి పొదిగితివి తమకాన నన్ను నిట్టె కగ్గుదేరి వూరకె కైకోనైతిగాని (॥నీవ॥) ఆదరించి కూడితివి అన్నిటా శ్రీవేంకటేశ ఆదిగొని పంతాలు నే నాడితిగాని నీదయెల్లా నించితివి నిండా నాపై నిట్టె సాదించి వేడుక నిన్ను జట్టిగొంటిగాని English(||pallavi||) nīvalla dosamu ledu nene vayomadamuna sevalu seyaga guṭṭu sesidim̐gāni (||nīva||) sanavĕllā nichchidivi samugāna nīvu nā manasulonide kaḍumaṁkugāni pĕnagidi viṁtesi priyabaḍi, nene nīgu sĕnagajālaga bigisidigāni (||nīva||) siggulĕlla dersidivi seyi vaṭṭi nīvaide vĕggaḽiṁchi vidiliṁchi vesidigāni daggari pŏdigidivi tamagāna nannu niṭṭĕ kagguderi vūragĕ kaigonaidigāni (||nīva||) ādariṁchi kūḍidivi anniḍā śhrīveṁkaḍeśha ādigŏni paṁtālu ne nāḍidigāni nīdayĕllā niṁchidivi niṁḍā nābai niṭṭĕ sādiṁchi veḍuga ninnu jaṭṭigŏṁṭigāni