Title (Indic)నీకుఁ బోదు నాకుఁ బోదు నీ చనవుగలదాన WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నీకుఁ బోదు నాకుఁ బోదు నీ చనవుగలదాన మేకొని నిన్నేమనినా మేలుసుమ్మీ విభుఁడా (॥నీకుఁ॥) వొద్దనుండి చన్నులనే వొరసితి నే నిన్ను అద్దుక నాఁటవుగదా ఆకొనలు పెద్దరికానకే కడుఁబెనఁగేవారము నీపై- నుద్దండాలు సేతుము వోరుచుకో విభుఁడా (॥నీకుఁ॥) ముచ్చటాడేనని వచ్చి మోవి యెంగిలిసేసితి పచ్చియై తోఁచదుగదా పలుసోఁకుల మెచ్చులసలిగెలను మెరసెవారము నిన్ను యెచ్చుకుందు లాడుదుము యియ్యకొమ్మా విభుఁడా (॥నీకుఁ॥) కాఁగిలించుకొంటానే కన్నుల జంకించితిని చేఁగదేరించవుగదా చేఁతలెల్లాను మూఁగిన శ్రీవేంకటేశ మోహపువారము నీతో వీఁగక కూడితి మిది వింతసుమ్మీ విభుఁడా English(||pallavi||) nīgum̐ bodu nāgum̐ bodu nī sanavugaladāna megŏni ninnemaninā melusummī vibhum̐ḍā (||nīgum̐||) vŏddanuṁḍi sannulane vŏrasidi ne ninnu adduga nām̐ṭavugadā āgŏnalu pĕddarigānage kaḍum̐bĕnam̐gevāramu nībai- nuddaṁḍālu sedumu vorusugo vibhum̐ḍā (||nīgum̐||) muchchaḍāḍenani vachchi movi yĕṁgilisesidi pachchiyai tom̐sadugadā palusom̐kula mĕchchulasaligĕlanu mĕrasĕvāramu ninnu yĕchchuguṁdu lāḍudumu yiyyagŏmmā vibhum̐ḍā (||nīgum̐||) kām̐giliṁchugŏṁṭāne kannula jaṁkiṁchidini sem̐gaderiṁchavugadā sem̐talĕllānu mūm̐gina śhrīveṁkaḍeśha mohabuvāramu nīdo vīm̐gaga kūḍidi midi viṁtasummī vibhum̐ḍā