Title (Indic)మూసి మంతనములేల ముంచి వెల్లవిరిగాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మూసి మంతనములేల ముంచి వెల్లవిరిగాను సేసవెట్టి పెండ్లాడితే చేరి వద్దనేనూ (॥మూసి॥) తెరమరఁగున నుండి తేఁకువతో నాయకుని విరుల నెంత వేసేవే వేమారును అరిమురి నేఁడు నీకు నంత వలపుగలిగితే సరసఁ గూచుండి మోవి చవి చూపరాదా (॥మూసి॥) అవ్వలిమోము సేసుక యంతలోనే రమణుని నవ్వుచుఁ గివగోరేల నాఁటించేవే యెవ్వరూ నేమి చెప్పేరు యింత నీకు వేడుకైతే చివ్వన గాఁగిట నించి చిమ్మరేఁచరాదా (॥మూసి॥) చెక్కిటఁ జేయి వెట్టుక శ్రీవేంకటేశ్వరుని నిక్కి యేమి చూచేవే నివ్వెరగుతో నెక్కొని న న్నితఁడేలె నీకూఁ గొంత చుట్టమైతే మొక్కు మొక్కి వేఁడుకొని ముచ్చటాడరాదా English(||pallavi||) mūsi maṁtanamulela muṁchi vĕllavirigānu sesavĕṭṭi pĕṁḍlāḍide seri vaddanenū (||mūsi||) tĕramaram̐guna nuṁḍi tem̐kuvado nāyaguni virula nĕṁta veseve vemārunu arimuri nem̐ḍu nīgu naṁta valabugaligide sarasam̐ gūsuṁḍi movi savi sūbarādā (||mūsi||) avvalimomu sesuga yaṁtalone ramaṇuni navvusum̐ givagorela nām̐ṭiṁcheve yĕvvarū nemi sĕpperu yiṁta nīgu veḍugaide sivvana gām̐giḍa niṁchi simmarem̐sarādā (||mūsi||) sĕkkiḍam̐ jeyi vĕṭṭuga śhrīveṁkaḍeśhvaruni nikki yemi sūseve nivvĕragudo nĕkkŏni na nnidam̐ḍelĕ nīgūm̐ gŏṁta suṭṭamaide mŏkku mŏkki vem̐ḍugŏni muchchaḍāḍarādā