Title (Indic)మిక్కిలి తా నధికుఁడు మేలుదాన నే నైతి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మిక్కిలి తా నధికుఁడు మేలుదాన నే నైతి చక్కఁగా నెట్టు సేసినా సంతోసించేఁ గాకా (॥॥) అలుగఁగ నిఁక నేలే ఆతఁడు వీడె మియ్యఁగా తొలఁగక చే యొగ్గి యందుకొనేఁ గాక పలుక కుండఁగ నేలే పచారించి మాటాడఁగా వొలిసినట్టే ల్లాను వూఁకొనేఁ గాకా (॥॥) తప్పించు కొనఁగ నేలే తా నన్నుఁ బైకొనఁగాను వొప్పి ఇచ్చకురాలనై వుండేఁ గాక వుప్పతించి దూర నేలే వూరకే తా నవ్వఁగాను రెప్ప లెత్తి చూచి ఇంపు రేఁచేఁ గాకా (॥॥) సిగ్గులు వడఁగ నేలే సేసలు తాఁబెట్టఁ గాను అగ్గమై సిరసు నే నొగ్గేఁ గాక యెగ్గు లేక శ్రీ వేంకటేశుఁడిట్టే నన్నుఁగూడె వెగ్గళపు తమితోడ వెలసేఁగాకా English(||pallavi||) mikkili tā nadhigum̐ḍu meludāna ne naidi sakkam̐gā nĕṭṭu sesinā saṁtosiṁchem̐ gāgā (||||) alugam̐ga nim̐ka nele ādam̐ḍu vīḍĕ miyyam̐gā tŏlam̐gaga se yŏggi yaṁdugŏnem̐ gāga paluga kuṁḍam̐ga nele pasāriṁchi māḍāḍam̐gā vŏlisinaṭṭe llānu vūm̐kŏnem̐ gāgā (||||) tappiṁchu kŏnam̐ga nele tā nannum̐ baigŏnam̐gānu vŏppi ichchagurālanai vuṁḍem̐ gāga vuppadiṁchi dūra nele vūrage tā navvam̐gānu rĕppa lĕtti sūsi iṁpu rem̐sem̐ gāgā (||||) siggulu vaḍam̐ga nele sesalu tām̐bĕṭṭam̐ gānu aggamai sirasu ne nŏggem̐ gāga yĕggu lega śhrī veṁkaḍeśhum̐ḍiṭṭe nannum̐gūḍĕ vĕggaḽabu tamidoḍa vĕlasem̐gāgā