Title (Indic)మేమింత యేఁకరఁగాను మేలా వోయి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మేమింత యేఁకరఁగాను మేలా వోయి నాము లెక్క వలపించి నవ్వేవా వోయి (॥మేమిం॥) యింటికిఁ బిలువఁగాను యెఱఁగనట్టే పోయి దంటవై ఆడఁ గూచుఁడఁదగునా వోయి వెంటవెంట నే రాఁగా వెలఁదులచేతను కంటకములాడించ సంగతులా వోయి (॥మేమిం॥) కప్పురము నే నియ్యఁగా కడఁబెట్టి యొక్కతెను దప్పికి నీళ్లడిగేవు తగవా వోయి కొప్పువట్టి నేఁ దియ్యఁగా గొబ్బున ముసుఁగిడుక యిప్పుడే పవ్వళించేవు ఇదిగొంతా వోయి (॥మేమిం॥) కడఁగి శ్రీవేంకటేశ కాఁగిలించి నేఁ గూడితే తడవుకుఁ గరఁగేవు తగవా వోయి తడవి నే మొక్కఁగాను దయఁజూచితివి నీవే చిడుముడి నింతరట్టు సేతురా వోయి English(||pallavi||) memiṁta yem̐karam̐gānu melā voyi nāmu lĕkka valabiṁchi navvevā voyi (||memiṁ||) yiṁṭigim̐ biluvam̐gānu yĕṟam̐ganaṭṭe poyi daṁṭavai āḍam̐ gūsum̐ḍam̐dagunā voyi vĕṁṭavĕṁṭa ne rām̐gā vĕlam̐dulasedanu kaṁṭagamulāḍiṁcha saṁgadulā voyi (||memiṁ||) kappuramu ne niyyam̐gā kaḍam̐bĕṭṭi yŏkkadĕnu dappigi nīḽlaḍigevu tagavā voyi kŏppuvaṭṭi nem̐ diyyam̐gā gŏbbuna musum̐giḍuga yippuḍe pavvaḽiṁchevu idigŏṁtā voyi (||memiṁ||) kaḍam̐gi śhrīveṁkaḍeśha kām̐giliṁchi nem̐ gūḍide taḍavugum̐ garam̐gevu tagavā voyi taḍavi ne mŏkkam̐gānu dayam̐jūsidivi nīve siḍumuḍi niṁtaraṭṭu sedurā voyi