Title (Indic)మెచ్చితి మప్పుడే నీకు మిక్కిలి మోహించితిమి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మెచ్చితి మప్పుడే నీకు మిక్కిలి మోహించితిమి హెచ్చె నీ సింగారాలు యెక్కడ చూచినను (॥మెచ్చి॥) అరిదిచెక్కులమీఁది యంగనకస్తూరివూఁత కరఁగి నీచెంపలపై కారివుండఁగా దొరతనాలు సేసేవు తొయ్యలులలోననెల్లా యిరవాయ నీయెమ్మె యేమిచెప్పేది (॥మెచ్చి॥) కోమలిగుబ్బలమీఁదికుంకుమగందపుఁబూఁత ఆముకొని నీవురాన నంటివుండఁగా సాముసేసేవానివలె సతులకుఁజూపేవు నే మెఱఁగమా నీవు నెరజాణవౌట (॥మెచ్చి॥) పొలఁతిమైనలఁదినపొడికప్పురపుపూఁత నెలకొని రతివేల నీపై నంటఁగా కొలువులో మాకుఁ జూపి కూడితివి మమ్మిందరి తలఁచమా శ్రీవేంకటోత్తమనీమహిమలు English(||pallavi||) mĕchchidi mappuḍe nīgu mikkili mohiṁchidimi hĕchchĕ nī siṁgārālu yĕkkaḍa sūsinanu (||mĕchchi||) aridisĕkkulamīm̐di yaṁganagastūrivūm̐ta karam̐gi nīsĕṁpalabai kārivuṁḍam̐gā dŏradanālu sesevu tŏyyalulalonanĕllā yiravāya nīyĕmmĕ yemisĕppedi (||mĕchchi||) komaligubbalamīm̐diguṁkumagaṁdabum̐būm̐ta āmugŏni nīvurāna naṁṭivuṁḍam̐gā sāmusesevānivalĕ sadulagum̐jūbevu ne mĕṟam̐gamā nīvu nĕrajāṇavauḍa (||mĕchchi||) pŏlam̐timainalam̐dinabŏḍigappurabubūm̐ta nĕlagŏni radivela nībai naṁṭam̐gā kŏluvulo māgum̐ jūbi kūḍidivi mammiṁdari talam̐samā śhrīveṁkaḍottamanīmahimalu