Title (Indic)మమ్మేమి చూచేవు నీవు మాఁటిమాఁటికి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మమ్మేమి చూచేవు నీవు మాఁటిమాఁటికి దిమ్ముల మీలోమీరే తెలుసుకోరయ్యా (॥మమ్మే॥) తతి నామొగమైయుండి తలఁచుక నవ్వేవు సతి నీతోనన్నమాట సరివచ్చెనా మతకరివాఁడవు మాయదారి ఆపె నీకు ఇతవుగ మరుఁడు మిమ్మెట్టు గూర్చెనయ్యా (॥మమ్మే॥) పందేలు వేయుచు నాతో పచ్చిమాటలాడేవు అందిచ్చి నాఁడె నీకు ఆపె నేర్పెనా అందగాఁడవు నీవైతే అంకెలు నేరుచునాపె ఇందుకునందుకు సరి యెట్టుగూర్చె మరుఁడు (॥మమ్మే॥) శ్రీ వేంకటేశుఁడ నన్నుఁ జిత్తగించి కూడితివి వేవేలుగ నాపె నీకు విన్నవించెనా దేవర విన్నిటా నీవు దేవులమ్మ ఆపె నీకు యీవిధాల మరుఁడు మి మ్మెట్టు గూర్చె నిపుడు English(||pallavi||) mammemi sūsevu nīvu mām̐ṭimām̐ṭigi dimmula mīlomīre tĕlusugorayyā (||mamme||) tadi nāmŏgamaiyuṁḍi talam̐suga navvevu sadi nīdonannamāḍa sarivachchĕnā madagarivām̐ḍavu māyadāri ābĕ nīgu idavuga marum̐ḍu mimmĕṭṭu gūrsĕnayyā (||mamme||) paṁdelu veyusu nādo pachchimāḍalāḍevu aṁdichchi nām̐ḍĕ nīgu ābĕ nerbĕnā aṁdagām̐ḍavu nīvaide aṁkĕlu nerusunābĕ iṁdugunaṁdugu sari yĕṭṭugūrsĕ marum̐ḍu (||mamme||) śhrī veṁkaḍeśhum̐ḍa nannum̐ jittagiṁchi kūḍidivi veveluga nābĕ nīgu vinnaviṁchĕnā devara vinniḍā nīvu devulamma ābĕ nīgu yīvidhāla marum̐ḍu mi mmĕṭṭu gūrsĕ nibuḍu