Title (Indic)కన్నదే విన్నదే కందువ సుమ్మీ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కన్నదే విన్నదే కందువ సుమ్మీ వున్నతి నీసతి సుమ్మీ వొడఁబాటిద్దరికి (॥కన్న॥) యేకడ నీవుండినాను యెంత పనిగలిగినా ఆకెమాటే నామాట అట్టె రమ్మీ పోకలెన్నైనాఁ గలవు పొందు లెన్నైనాఁగలదు సాకిరి యీచెలిసుమ్మీ సరుస నిద్దరికి (॥కన్న॥) అలుకెంత గలిగినా అడ్డములే యాడినా చెలిమొక్కే నామొక్కు చేకోనుమీ తలఁపటైయినాఁగాని తగులెంతయినాఁగాని తొలుత యీపెసుమ్మీ దూతిక యిద్దరికి (॥కన్న॥) యెంతదవ్వువొయినా యేమని పోడచూపినా యింతిసన్నే నాసన్న యెఱుఁగుకొమ్మీ యింతేల శ్రీవేంకటేశ యిందాఁకాఁ గూడితిని సంతతయు నీకెసుమ్మీ సాదన మిద్దరికి English(||pallavi||) kannade vinnade kaṁduva summī vunnadi nīsadi summī vŏḍam̐bāḍiddarigi (||kanna||) yegaḍa nīvuṁḍinānu yĕṁta panigaliginā āgĕmāḍe nāmāḍa aṭṭĕ rammī pogalĕnnainām̐ galavu pŏṁdu lĕnnainām̐galadu sāgiri yīsĕlisummī sarusa niddarigi (||kanna||) alugĕṁta galiginā aḍḍamule yāḍinā sĕlimŏkke nāmŏkku segonumī talam̐paḍaiyinām̐gāni tagulĕṁtayinām̐gāni tŏluda yībĕsummī dūdiga yiddarigi (||kanna||) yĕṁtadavvuvŏyinā yemani poḍasūbinā yiṁtisanne nāsanna yĕṟum̐gugŏmmī yiṁtela śhrīveṁkaḍeśha yiṁdām̐kām̐ gūḍidini saṁtadayu nīgĕsummī sādana middarigi