Title (Indic)కాంతలాల యెటువంటి గామిడితనాలవాఁడే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాంతలాల యెటువంటి గామిడితనాలవాఁడే కొంత గోర గీరితేనే గొబ్బునఁ దిట్టీనే (॥కాంత॥) వొప్పుగాఁ బదారువేలువువిదల నెట్టేలెనే కొప్పువట్టి నేఁ దీసితే కొచ్చి చూచీని అప్పటి భూకాంతమగఁడటవే తా నిన్నిటాను కప్పి నా చనుఁగొండలు కడువేఁగు లనీని (॥కాంత॥) యేడలేనిగొల్లెతల కెట్టు మగఁడాయనే వేడుకఁ దమ్మఇడితే వెడనీఁగీని పాడితోడ నెనమండ్రు పట్టపుదేవుళ్లటవే కూడి నేఁ దొడెకితే సిగ్గులు వడీని (॥కాంత॥) వీఁపునా రొమ్మునా నెత్తి వెలఁదుల మోచెనటె పై పై నేఁ గాలు దొక్కితే బడలీఁ దాను యేపున శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె తీపుమోవి చవిగొంటే తేనెలూరించీని English(||pallavi||) kāṁtalāla yĕḍuvaṁṭi gāmiḍidanālavām̐ḍe kŏṁta gora gīridene gŏbbunam̐ diṭṭīne (||kāṁta||) vŏppugām̐ badāruveluvuvidala nĕṭṭelĕne kŏppuvaṭṭi nem̐ dīside kŏchchi sūsīni appaḍi bhūgāṁtamagam̐ḍaḍave tā ninniḍānu kappi nā sanum̐gŏṁḍalu kaḍuvem̐gu lanīni (||kāṁta||) yeḍalenigŏllĕdala kĕṭṭu magam̐ḍāyane veḍugam̐ damma̮iḍide vĕḍanīm̐gīni pāḍidoḍa nĕnamaṁḍru paṭṭabudevuḽlaḍave kūḍi nem̐ dŏḍĕgide siggulu vaḍīni (||kāṁta||) vīm̐punā rŏmmunā nĕtti vĕlam̐dula mosĕnaḍĕ pai pai nem̐ gālu dŏkkide baḍalīm̐ dānu yebuna śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐ gūḍĕ tībumovi savigŏṁṭe tenĕlūriṁchīni