Title (Indic)కాంతపై మిక్కిలి బత్తిగలిగిన చెలులాల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాంతపై మిక్కిలి బత్తిగలిగిన చెలులాల పొంత నీపె వేడుకలు పొసఁగఁగజేయరే (॥కాంత॥) వనములో కోవిలల వట్టి రట్టు సేయనేల పెనఁగి తుమ్మిదల కోపించఁగనేల పనివడి చందురునిపై నేరమెంచనేల వినయాన విభునికే విన్నపము సేయరే (॥కాంత॥) గూటిలోని చిలుకలఁ గొసరి జంకించనేల నీటునఁ జల్లగాలిని నిందించనేల పాటించి వసంతునితో పంతాలు దూయనేల మాటలాడి విభుని నెమ్మదిని రప్పించరే (॥కాంత॥) పంచనున్న పావురాల బదరి తిట్టఁగనేల పంచసాయకుని నొడఁబరచనేల యెంచఁగ శ్రీవేంకటేశుఁ డిదె వచ్చి యింతిఁ గూడె మంచివాయఁ బనులెల్లా మనవులు చెప్పరే English(||pallavi||) kāṁtabai mikkili battigaligina sĕlulāla pŏṁta nībĕ veḍugalu pŏsam̐gam̐gajeyare (||kāṁta||) vanamulo kovilala vaṭṭi raṭṭu seyanela pĕnam̐gi tummidala kobiṁcham̐ganela panivaḍi saṁdurunibai neramĕṁchanela vinayāna vibhunige vinnabamu seyare (||kāṁta||) gūḍiloni silugalam̐ gŏsari jaṁkiṁchanela nīḍunam̐ jallagālini niṁdiṁchanela pāḍiṁchi vasaṁtunido paṁtālu dūyanela māḍalāḍi vibhuni nĕmmadini rappiṁchare (||kāṁta||) paṁchanunna pāvurāla badari tiṭṭam̐ganela paṁchasāyaguni nŏḍam̐barasanela yĕṁcham̐ga śhrīveṁkaḍeśhum̐ ḍidĕ vachchi yiṁtim̐ gūḍĕ maṁchivāyam̐ banulĕllā manavulu sĕppare