Title (Indic)ఇట్టివాఁడవు సులభమెట్లా నైతివో కాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇట్టివాఁడవు సులభమెట్లా నైతివో కాక అట్టి నీదయ దలఁచి అరుదయ్యీ నాకు (॥ఇట్టి॥) యేమేమి చదువవలె నెందరి నడుగవలె ఆముక నిన్నుఁ దెలిసే యందుకొరకు భూమిలోన నెంతేసి పుణ్యములు సేయవలె కామించి నీపై భక్తి గలిగేటికొరకు (॥ఇట్టి॥) యెన్నిజన్మా లెత్తవలె నెందెందు వెదకవలె కన్నుల నీసాకారము గనేకొరకు వున్నతి నెంతగాలము వొగ్గి కాచుకుండవలె విన్నవించి నీసేవ వేఁడుకొనేకొరకు (॥ఇట్టి॥) యేదేది యెఱఁగవలె యెట్లభ్యసించవలె నీదాసుఁ డనిపించుకొనేటికొరకు సాదరాన శ్రీవేంకటేశ్వర నన్ను మన్నించితి- వేదెసఁ బొగడవలె యింత సేసేకొరకు English(||pallavi||) iṭṭivām̐ḍavu sulabhamĕṭlā naidivo kāga aṭṭi nīdaya dalam̐si arudayyī nāgu (||iṭṭi||) yememi saduvavalĕ nĕṁdari naḍugavalĕ āmuga ninnum̐ dĕlise yaṁdugŏragu bhūmilona nĕṁtesi puṇyamulu seyavalĕ kāmiṁchi nībai bhakti galigeḍigŏragu (||iṭṭi||) yĕnnijanmā lĕttavalĕ nĕṁdĕṁdu vĕdagavalĕ kannula nīsāgāramu ganegŏragu vunnadi nĕṁtagālamu vŏggi kāsuguṁḍavalĕ vinnaviṁchi nīseva vem̐ḍugŏnegŏragu (||iṭṭi||) yededi yĕṟam̐gavalĕ yĕṭlabhyasiṁchavalĕ nīdāsum̐ ḍanibiṁchugŏneḍigŏragu sādarāna śhrīveṁkaḍeśhvara nannu manniṁchidi- vedĕsam̐ bŏgaḍavalĕ yiṁta sesegŏragu