Title (Indic)ఇంత నీకు వెఱపేల ఇద్దరిఁ గన్నులఁ గంటి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇంత నీకు వెఱపేల ఇద్దరిఁ గన్నులఁ గంటి యెంతైనా నీ హితవే ఇటు నా హితవురా (॥॥) యెవ్వతెకు నీవు మోహించి వుండినాను నివ్వటిల్ల నాకె నాకు నీమాదే జవ్వనియెవ్వతెతోడ సారె నీవు నవ్వినాను నవ్వుగాదు అది నీవు నాతో నవ్వుతరా (॥॥) ఇద్దరు మీ రేకతాన నేమి మాటలాడుకొన్నా ముద్దుల నవి నాతోడి ముచ్చటలురా గద్దించి యెవ్వతె నిన్నుఁ గాగిలించుకొన్నాను కొద్దిమీరినట్టివే నాకూటములురా (॥॥) చెక్కునొక్కి యెవ్వతైనాఁ జేఁత నిన్నుఁజేసినాను అక్కరతో నాచేఁత లవియెల్లారా ఇక్కువతో శ్రీ వేంకటేశ నన్నుఁ గూడితివి నిక్కముగ వారెల్లా నే నొకతెనేరా English(||pallavi||) iṁta nīgu vĕṟabela iddarim̐ gannulam̐ gaṁṭi yĕṁtainā nī hidave iḍu nā hidavurā (||||) yĕvvadĕgu nīvu mohiṁchi vuṁḍinānu nivvaḍilla nāgĕ nāgu nīmāde javvaniyĕvvadĕdoḍa sārĕ nīvu navvinānu navvugādu adi nīvu nādo navvudarā (||||) iddaru mī regadāna nemi māḍalāḍugŏnnā muddula navi nādoḍi muchchaḍalurā gaddiṁchi yĕvvadĕ ninnum̐ gāgiliṁchugŏnnānu kŏddimīrinaṭṭive nāgūḍamulurā (||||) sĕkkunŏkki yĕvvadainām̐ jem̐ta ninnum̐jesinānu akkarado nāsem̐ta laviyĕllārā ikkuvado śhrī veṁkaḍeśha nannum̐ gūḍidivi nikkamuga vārĕllā ne nŏgadĕnerā