Title (Indic)ఇందుకే నేఁ జింతించేను యెటువలె నున్నాఁడవో WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇందుకే నేఁ జింతించేను యెటువలె నున్నాఁడవో సందడి పెండ్లిండ్లాయ సరుస నీబతుకు (॥ఇందు॥) చెంతలనాపె నీపైఁ జెలు చాఁచఁగాను వంతుకుఁ జెయి చాఁచితినివ్వల నేనుండి యింతుల మిద్దరమును యిరువంకలానుండఁగా సంతకూటమాయను చక్కని నీమేను (॥ఇందు॥) ఆకడనాకె నీకు నాకుమడిచియ్యఁగాను యీకడ నేనూ నీకునిచ్చితినిట్టే కైకొని యిద్దరునూడిగము నీకుఁ జేయఁగాను కాకువడి కలగూరగంపాయ నీనోరు (॥ఇందు॥) గక్కన నాపె నిన్నుఁ గాఁగిటఁ గూడఁగాను వొక్కటై నేనూనట్టే వొనరఁగాను యిక్కువ శ్రీ వెంకటేశ యెనసి యిద్దరివల్లా అక్కర నురిపేకళ్ళమాయను నీవురము English(||pallavi||) iṁduge nem̐ jiṁtiṁchenu yĕḍuvalĕ nunnām̐ḍavo saṁdaḍi pĕṁḍliṁḍlāya sarusa nībadugu (||iṁdu||) sĕṁtalanābĕ nībaim̐ jĕlu sām̐sam̐gānu vaṁtugum̐ jĕyi sām̐sidinivvala nenuṁḍi yiṁtula middaramunu yiruvaṁkalānuṁḍam̐gā saṁtagūḍamāyanu sakkani nīmenu (||iṁdu||) āgaḍanāgĕ nīgu nāgumaḍisiyyam̐gānu yīgaḍa nenū nīgunichchidiniṭṭe kaigŏni yiddarunūḍigamu nīgum̐ jeyam̐gānu kāguvaḍi kalagūragaṁpāya nīnoru (||iṁdu||) gakkana nābĕ ninnum̐ gām̐giḍam̐ gūḍam̐gānu vŏkkaḍai nenūnaṭṭe vŏnaram̐gānu yikkuva śhrī vĕṁkaḍeśha yĕnasi yiddarivallā akkara nuribegaḽḽamāyanu nīvuramu