Title (Indic)ఇటువంటివెల్లా నీకే యిట్టే సెలవు సేసితి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇటువంటివెల్లా నీకే యిట్టే సెలవు సేసితి తటుకన నీవనే నిధానము చేకొంటిని (॥ఇటు॥) కామించితి నాత్మ నిన్నుఁ గలసి భోగించుటకు వేమరుఁ గ్రోధించితి నీవిరోధులపై నేమమున లోభించితి నీమంత్రమన్యుల కియ్య ఆముకొని మోహించితి హరి నీరూపునకు (॥ఇటు॥) యెఱుకతో మదించితి యిట్టే నీదాస్యమున మఱి నిన్నొల్లని చదువు మచ్చరించితి తఱిఁ జలపట్టితి నీతప్పని భ క్తియందు వెఱవక నిన్నొల్లని విధుల నిందించితి (॥ఇటు॥) కల కర్మములెల్లా నీకైంకర్యములందు వెట్టితి బలు మమకారము నీపైఁ జేర్చితిఁ యెలిమి శ్రీవేంకటేశ యిన్నిటా నన్నేలితివి నిలిచిన కాలమెల్లా నీసేవే చేసితి English(||pallavi||) iḍuvaṁṭivĕllā nīge yiṭṭe sĕlavu sesidi taḍugana nīvane nidhānamu segŏṁṭini (||iḍu||) kāmiṁchidi nātma ninnum̐ galasi bhogiṁchuḍagu vemarum̐ grodhiṁchidi nīvirodhulabai nemamuna lobhiṁchidi nīmaṁtramanyula kiyya āmugŏni mohiṁchidi hari nīrūbunagu (||iḍu||) yĕṟugado madiṁchidi yiṭṭe nīdāsyamuna maṟi ninnŏllani saduvu machchariṁchidi taṟim̐ jalabaṭṭidi nīdappani bha ktiyaṁdu vĕṟavaga ninnŏllani vidhula niṁdiṁchidi (||iḍu||) kala karmamulĕllā nīgaiṁkaryamulaṁdu vĕṭṭidi balu mamagāramu nībaim̐ jersidim̐ yĕlimi śhrīveṁkaḍeśha yinniḍā nannelidivi nilisina kālamĕllā nīseve sesidi