Title (Indic)ఇదివో సంసారమెంత సుఖమో కాని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇదివో సంసారమెంత సుఖమో కాని తుదలేని దుఃఖమను తొడవు గడియించె (॥ఇదివో॥) పంచేద్రియంబులను పాతకులు దనుఁదెచ్చి కొంచెపు సుఖంబునకుఁ గూర్పఁగాను మించి కామంబనేడిమేఁటి తనయుండు జని- యించి దురితధనమెల్ల గడియించె (॥ఇదివో॥) పాయమనియెడి మహపాతకుఁడు తనుఁ దెచ్చి మాయంపు సుఖమునకు మరుపఁగాను సోయగపు మోహమను సుతుఁడేచి గుణమెల్లఁ బోయి యీనరకమనుపురము గడియించె (॥ఇదివో॥) అతియుండగువేంకటాద్రీశుఁడను మహ- హితుఁడు చిత్తములోన నెనయఁగాను మతిలోపల విరక్తిమగువ జనియించి య- ప్రతియయి మోక్షసంపదలు గడియించె English(||pallavi||) idivo saṁsāramĕṁta sukhamo kāni tudaleni duḥkhamanu tŏḍavu gaḍiyiṁchĕ (||idivo||) paṁchedriyaṁbulanu pādagulu danum̐dĕchchi kŏṁchĕbu sukhaṁbunagum̐ gūrbam̐gānu miṁchi kāmaṁbaneḍimem̐ṭi tanayuṁḍu jani- yiṁchi duridadhanamĕlla gaḍiyiṁchĕ (||idivo||) pāyamaniyĕḍi mahabādagum̐ḍu tanum̐ dĕchchi māyaṁpu sukhamunagu marubam̐gānu soyagabu mohamanu sudum̐ḍesi guṇamĕllam̐ boyi yīnaragamanuburamu gaḍiyiṁchĕ (||idivo||) adiyuṁḍaguveṁkaḍādrīśhum̐ḍanu maha- hidum̐ḍu sittamulona nĕnayam̐gānu madilobala viraktimaguva janiyiṁchi ya- pradiyayi mokṣhasaṁpadalu gaḍiyiṁchĕ