Title (Indic)ఇదివో మా విన్నపము యిట్టె చిత్తగించవయ్య WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇదివో మా విన్నపము యిట్టె చిత్తగించవయ్య సుదతి వున్న జాడలు చూతువు రావయ్యా (॥॥) యిప్పుడే వచ్చేవని యింటవాకిటను చెలి కప్పురపుటారతెత్తఁ గాచుకున్నది దప్పిదేర నీకునేలఁ తట్టిలోన బాగాలు కుప్పలుగా మీఁదెత్తు కొని వున్నది (॥॥) ఆరగించవచ్చేవని అన్నిదెరఁగులనెల్లా చేరి విందాయితముగాఁ జేసుకున్నది గారవానఁ బాదాలుగడిగేనంటాఁ బన్నీరు ఆరీతిఁ బైఁడిబిందెల నమరించకున్నది (॥॥) పవళించవచ్చేవని పట్టెమంచముమీఁదట వివరించి వూఁబరపు వేసుకున్నది నివిరి శ్రీ వేంకటేశ నీవు విచ్చేసి కూడఁగ తవిలి యలమేల్మంగ తనివితో నున్నుది English(||pallavi||) idivo mā vinnabamu yiṭṭĕ sittagiṁchavayya sudadi vunna jāḍalu sūduvu rāvayyā (||||) yippuḍe vachchevani yiṁṭavāgiḍanu sĕli kappurabuḍāradĕttam̐ gāsugunnadi dappidera nīgunelam̐ taṭṭilona bāgālu kuppalugā mīm̐dĕttu kŏni vunnadi (||||) āragiṁchavachchevani annidĕram̐gulanĕllā seri viṁdāyidamugām̐ jesugunnadi gāravānam̐ bādālugaḍigenaṁṭām̐ bannīru ārīdim̐ baim̐ḍibiṁdĕla namariṁchagunnadi (||||) pavaḽiṁchavachchevani paṭṭĕmaṁchamumīm̐daḍa vivariṁchi vūm̐barabu vesugunnadi niviri śhrī veṁkaḍeśha nīvu vichchesi kūḍam̐ga tavili yalamelmaṁga tanivido nunnudi