Title (Indic)ఘనుఁడ నీకియ్యాట గలితేఁ జాలు । తొల్లి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఘనుఁడ నీకియ్యాట గలితేఁ జాలు । తొల్లి యెనసి పొందిన సతు లెట్టుండిరేమీ (॥ఘనుఁ॥) తరునితురుము నీకు దాగిలిముచ్చులాడ నిరవాయ రమణుఁడ యిదివో నీకు అరిదిఁ గుచుగిరులు అచ్చనగండ్లాడ వొరసాయ నిదివో నీకున్నవేమీ నేల (॥ఘనుఁ॥) వెలఁది మోము నీకు వెన్నెలపులుఁ గమాడ నెలవాయ నింతలోనే నీకిదివో చిలుపచెమటలెల్ల చిమ్మనగోవాటలాయె యిలపై నెక్కడిసుద్దు లేమైనా నేమీ (॥ఘనుఁ॥) కోమలికెమ్మోని నీకు గుజ్జనఁగూళ్లాయ గామిడి శ్రీవేంకటేశు(శ?) కాఁగిటిలోనే కామించువారినెల్లా గలసితి విట్లానే నేమరు నెందరైన వేసటనీకేది English(||pallavi||) ghanum̐ḍa nīgiyyāḍa galidem̐ jālu | tŏlli yĕnasi pŏṁdina sadu lĕṭṭuṁḍiremī (||ghanum̐||) tarunidurumu nīgu dāgilimuchchulāḍa niravāya ramaṇum̐ḍa yidivo nīgu aridim̐ gusugirulu achchanagaṁḍlāḍa vŏrasāya nidivo nīgunnavemī nela (||ghanum̐||) vĕlam̐di momu nīgu vĕnnĕlabulum̐ gamāḍa nĕlavāya niṁtalone nīgidivo silubasĕmaḍalĕlla simmanagovāḍalāyĕ yilabai nĕkkaḍisuddu lemainā nemī (||ghanum̐||) komaligĕmmoni nīgu gujjanam̐gūḽlāya gāmiḍi śhrīveṁkaḍeśhu(śha?) kām̐giḍilone kāmiṁchuvārinĕllā galasidi viṭlāne nemaru nĕṁdaraina vesaḍanīgedi