Title (Indic)ఎవ్వరిపై నింతేసి యేల దూరేవే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎవ్వరిపై నింతేసి యేల దూరేవే పువ్వులు నిన్నే తాఁకఁ బొంచెనటవే (॥ఎవ్వ॥) పండువెన్నెలలు నీపై గాయఁగా నీఁ కెండలాయెనంటా నేల తిట్టేవే నిండిన చందురుఁడు నీకు నాతనికి కొండుకపాయము రూపు కూడపెట్టె నటవే (॥ఎవ్వ॥) చల్లగాలి నిన్నును జాలిఁబెట్టెనంటా వెల్లిగ నాకేలేలట్టే విఱిచేవే మెల్లనే నీవిభుని మేనితావి యింతేసి చల్లుమని గాలియేమి చాటెనటవే (॥ఎవ్వ॥) కోవిలలు నిన్నుఁ గోపగించెనంటా యీవల నావలనెల్ల నేల దూరేవే శ్రీ వేంకటేశుని చెలియ నీకౌఁగిట చేవగాఁ గూడుమని చెప్పెనటవే English(||pallavi||) ĕvvaribai niṁtesi yela dūreve puvvulu ninne tām̐kam̐ bŏṁchĕnaḍave (||ĕvva||) paṁḍuvĕnnĕlalu nībai gāyam̐gā nīm̐ kĕṁḍalāyĕnaṁṭā nela tiṭṭeve niṁḍina saṁdurum̐ḍu nīgu nādanigi kŏṁḍugabāyamu rūbu kūḍabĕṭṭĕ naḍave (||ĕvva||) sallagāli ninnunu jālim̐bĕṭṭĕnaṁṭā vĕlliga nāgelelaṭṭe viṟiseve mĕllane nīvibhuni menidāvi yiṁtesi sallumani gāliyemi sāḍĕnaḍave (||ĕvva||) kovilalu ninnum̐ gobagiṁchĕnaṁṭā yīvala nāvalanĕlla nela dūreve śhrī veṁkaḍeśhuni sĕliya nīgaum̐giḍa sevagām̐ gūḍumani sĕppĕnaḍave