Title (Indic)ఎవ్వరి సాకిరి నేమిటికి యిటు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎవ్వరి సాకిరి నేమిటికి యిటు నవ్వక చూచిన నమ్ముదుఁ బో (॥ఎవ్వరి॥) పయ్యదలోనివే భారపుగుబ్బలు తియ్యవిలుతు దళ దిబ్బెములు నెయ్యమిఁ దొడికినని కల్ల నిజము లియ్యడ నిన్నియు నేర్పడుఁబో (॥ఎవ్వరి॥) ఱట్టడి విపు డాఱడి నా యారిది పట్టరాని బలుపామిదివో యిట్టే యితరము లెఱుఁగ ననుచు వా కట్టక ముట్టినఁ గందమువో (॥ఎవ్వరి॥) శ్రీవేంకటపతి సిరుల నీవిముడి చేవలనే వేసిన ముడి యా యీవలఁ గూడుచు నెత్తితి నిఁక నా భావములో నిజపట్టితిఁబో English(||pallavi||) ĕvvari sāgiri nemiḍigi yiḍu navvaga sūsina nammudum̐ bo (||ĕvvari||) payyadalonive bhārabugubbalu tiyyaviludu daḽa dibbĕmulu nĕyyamim̐ dŏḍiginani kalla nijamu liyyaḍa ninniyu nerbaḍum̐bo (||ĕvvari||) ṟaṭṭaḍi vibu ḍāṟaḍi nā yāridi paṭṭarāni balubāmidivo yiṭṭe yidaramu lĕṟum̐ga nanusu vā kaṭṭaga muṭṭinam̐ gaṁdamuvo (||ĕvvari||) śhrīveṁkaḍabadi sirula nīvimuḍi sevalane vesina muḍi yā yīvalam̐ gūḍusu nĕttidi nim̐ka nā bhāvamulo nijabaṭṭidim̐bo