Title (Indic)ఎట్టు నిద్దిరించెనో యీరేతి రెల్లాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎట్టు నిద్దిరించెనో యీరేతి రెల్లాను పట్టి చుట్టుక పయ్యద పడఁదీసీ క్రిష్ణుఁడూ (॥ఎట్టు॥) కడువేఁకువను లేచి కన్నులు పులుముకొంటా కడు పక్కలించి యాఁకలయ్యీనని కుడు కొకచేఁ బట్టి నా కొం గొకచేతఁ బట్టి అడిగి నన్నము కృష్టుఁ డప్పుడే చూడరే (॥ఎట్టు॥) పెరుగు దరువ నన్నుఁ దిరిగిరాఁ జుట్టి చుట్టి కురుచమాటల ముద్దుగునియుచును తిరిగి కవ్వపుఁ గొల దిక్కఁ గాఁగిలించి పట్టి తరివెన్న వెట్టుమనీ తగునే యీకృష్ణుఁడు (॥ఎట్టు॥) తనకుఁ బెట్టినది తలి పడుచుల కిచ్చి కినిసి ముచ్చిలి యారగేంచీఁ దాను అనయము శ్రీ వేంగటాది కృష్టఁడు వేఁడు తనిసి తనయెంగిలి తగ నాకు నిచ్చెనే English(||pallavi||) ĕṭṭu niddiriṁchĕno yīredi rĕllānu paṭṭi suṭṭuga payyada paḍam̐dīsī kriṣhṇum̐ḍū (||ĕṭṭu||) kaḍuvem̐kuvanu lesi kannulu pulumugŏṁṭā kaḍu pakkaliṁchi yām̐kalayyīnani kuḍu kŏgasem̐ baṭṭi nā kŏṁ gŏgasedam̐ baṭṭi aḍigi nannamu kṛṣhṭum̐ ḍappuḍe sūḍare (||ĕṭṭu||) pĕrugu daruva nannum̐ dirigirām̐ juṭṭi suṭṭi kurusamāḍala mudduguniyusunu tirigi kavvabum̐ gŏla dikkam̐ gām̐giliṁchi paṭṭi tarivĕnna vĕṭṭumanī tagune yīkṛṣhṇum̐ḍu (||ĕṭṭu||) tanagum̐ bĕṭṭinadi tali paḍusula kichchi kinisi muchchili yārageṁchīm̐ dānu anayamu śhrī veṁgaḍādi kṛṣhṭam̐ḍu vem̐ḍu tanisi tanayĕṁgili taga nāgu nichchĕne