Title (Indic)ఎన్నిలేవు సుద్దులు యేఁటికి విచారాలు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎన్నిలేవు సుద్దులు యేఁటికి విచారాలు మన్నించి ఆ చింతలెల్లా మానుము నీ విఁకను (॥ఎన్ని॥) మనసెఱిఁగినచోట మాటలు సోదించనేల తనువుకుఁ దనువే తారుకాణ పనిమాలినపనికి బాసలేల సేసేవు చెనకితి లోనికి విచ్చేయవయ్యా యిఁకను (॥ఎని॥) కూడివుండినట్టిచోట గుఱుతు వెతకనేల వేడుకలు వేడుకలే వీడుజోళ్లు జాడలతో వారి వీరి సాకిరేల తెలిపేవు వీడెమిచ్చే నామాఁట వినవయ్య ఇఁకను (॥ఎన్ని॥) రతి గలిగినచోట రవ్వసేయఁగనేల యితవుకు నితవులే యియ్యకోళ్లు సతమై శ్రీవేంకటేశ సరిగాఁ గూడితి నన్ను అతిముదములు మనకబ్బెనయ్యా ఇఁకను English(||pallavi||) ĕnnilevu suddulu yem̐ṭigi visārālu manniṁchi ā siṁtalĕllā mānumu nī vim̐kanu (||ĕnni||) manasĕṟim̐ginasoḍa māḍalu sodiṁchanela tanuvugum̐ danuve tārugāṇa panimālinabanigi bāsalela sesevu sĕnagidi lonigi vichcheyavayyā yim̐kanu (||ĕni||) kūḍivuṁḍinaṭṭisoḍa guṟudu vĕdaganela veḍugalu veḍugale vīḍujoḽlu jāḍalado vāri vīri sāgirela tĕlibevu vīḍĕmichche nāmām̐ṭa vinavayya im̐kanu (||ĕnni||) radi galiginasoḍa ravvaseyam̐ganela yidavugu nidavule yiyyagoḽlu sadamai śhrīveṁkaḍeśha sarigām̐ gūḍidi nannu adimudamulu managabbĕnayyā im̐kanu