Title (Indic)ఎంతలేదు మాటలు యేడ కేడ సుద్దులు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎంతలేదు మాటలు యేడ కేడ సుద్దులు యింతవాఁడ వౌత నిన్ను నెరఁగనా నేను (॥ఎంత॥) యెక్కడనుండోవచ్చి యిచ్చకము సేసి నా చెక్కులు నొక్కినదె సెలవా నాకు వొక్కమాటె నవ్వు నవ్వి వొడివట్టి తీసి నన్ను తక్కులఁ బెట్టినదె తనివారెనా (॥ఎంత॥) నిద్దుర గంటికిరాఁగా నీ చేఁతలు దాఁచుకొంటా వద్దఁ గూచుండినదె వరుసా నాకు సుద్దులెల్లఁ జెప్పి చెప్పి చొక్కులఁ బెట్టుచు నాతో పొద్దున మంచ మెక్కితె పొందికాయనా (॥ఎంత॥) వేడుకలు దైవార వేసాలకుఁ బొగడుతా యీడ నన్నుఁ జెనకేదె యీడె నాకు కూడితి శ్రీ వెంకటేశ గుణ మెరిఁగి నన్నిట్టె జోడువాయ కుండితేనె సోద్యమాయనా English(||pallavi||) ĕṁtaledu māḍalu yeḍa keḍa suddulu yiṁtavām̐ḍa vauda ninnu nĕram̐ganā nenu (||ĕṁta||) yĕkkaḍanuṁḍovachchi yichchagamu sesi nā sĕkkulu nŏkkinadĕ sĕlavā nāgu vŏkkamāḍĕ navvu navvi vŏḍivaṭṭi tīsi nannu takkulam̐ bĕṭṭinadĕ tanivārĕnā (||ĕṁta||) niddura gaṁṭigirām̐gā nī sem̐talu dām̐sugŏṁṭā vaddam̐ gūsuṁḍinadĕ varusā nāgu suddulĕllam̐ jĕppi sĕppi sŏkkulam̐ bĕṭṭusu nādo pŏdduna maṁcha mĕkkidĕ pŏṁdigāyanā (||ĕṁta||) veḍugalu daivāra vesālagum̐ bŏgaḍudā yīḍa nannum̐ jĕnagedĕ yīḍĕ nāgu kūḍidi śhrī vĕṁkaḍeśha guṇa mĕrim̐gi nanniṭṭĕ joḍuvāya kuṁḍidenĕ sodyamāyanā