Title (Indic)ఏమి సేసితివో యయ్య యిందుఁ గాని పొద్దు వోదా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏమి సేసితివో యయ్య యిందుఁ గాని పొద్దు వోదా రామను వేఁడుకొందువు రావయ్య లోనికి (॥ఏమి॥) వుండుండి దిగ్గన లేచి వువిద లోని కేఁగి పండఁబదె చింతతోడ పానుపుమీఁద అండనే మేనిసొమ్ములు అవే పెట్టెలోనఁ బెట్టి చండి సేసి యడిగిన చక్క మాకుఁ జెప్పదు (॥ఏమి॥) అప్పటి నంతటఁ బోక అంగన తెరలోనుండి విప్పచు నీపచ్చడము వెలివేసెను తొప్పుఁ దోఁగేఁ జెమటక కస్తూరిబొట్టు పట్టుగాఁగ యిప్పుడే తా దిద్దుకొని యేఁటి కన్నా మానదు (॥ఏమి॥) నీ వింతలో మొక్కఁ గాను నెలఁత చిఱునవ్వుతో సేవచేసి కౌఁగిలించె శ్రీవేంకటేశా వేవేలు వచ్చెఁ గోపము వేగిరమే తీరె మీకు దేవరలే మీరిద్దరు దిష్టమాయ మాకును English(||pallavi||) emi sesidivo yayya yiṁdum̐ gāni pŏddu vodā rāmanu vem̐ḍugŏṁduvu rāvayya lonigi (||emi||) vuṁḍuṁḍi diggana lesi vuvida loni kem̐gi paṁḍam̐badĕ siṁtadoḍa pānubumīm̐da aṁḍane menisŏmmulu ave pĕṭṭĕlonam̐ bĕṭṭi saṁḍi sesi yaḍigina sakka māgum̐ jĕppadu (||emi||) appaḍi naṁtaḍam̐ boga aṁgana tĕralonuṁḍi vippasu nībachchaḍamu vĕlivesĕnu tŏppum̐ dom̐gem̐ jĕmaḍaga kastūribŏṭṭu paṭṭugām̐ga yippuḍe tā diddugŏni yem̐ṭi kannā mānadu (||emi||) nī viṁtalo mŏkkam̐ gānu nĕlam̐ta siṟunavvudo sevasesi kaum̐giliṁchĕ śhrīveṁkaḍeśhā vevelu vachchĕm̐ gobamu vegirame tīrĕ mīgu devarale mīriddaru diṣhṭamāya māgunu