Title (Indic)ఎక్కడి కంసుడు యిఁక నెక్కడి భూభారము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎక్కడి కంసుడు యిఁక నెక్కడి భూభారము చిక్కువాప జనియించె శ్రీకృష్ణుఁడు (॥ఎక్క॥) అదివో చంద్రోదయ మదివో రోహిణిపొద్దు అదన శ్రీకృష్ణుఁడందె నవతారము గదయు శంఖచక్రాలు గల నాలుగుచేతుల నెదిరించి యున్నాఁడు ఇదివో బాలుఁడు (॥ఎక్క॥) వసుదేవుఁడల్ల వాఁడే వరుస దేవకి యదే కొసరే బ్రహ్మాదుల కొండాట మదే పొసఁగఁ బొత్తులవిూదఁ బురుఁటింటి లోపల శిసువై మహిమ చూపె శ్రీకృష్ణుఁడు (॥ఎక్క॥) పరంజ్యోతిరూప మిదె పాండవుల బ్రదికించె అరిది కౌరవులసంహారమూ నిదె హరికర్ఘ్యము లీరో జయంతి పండుగ సేయరొ కెరలి శ్రీవేంకటాద్రి కృష్ణుఁడితఁడు English(||pallavi||) ĕkkaḍi kaṁsuḍu yim̐ka nĕkkaḍi bhūbhāramu sikkuvāba janiyiṁchĕ śhrīkṛṣhṇum̐ḍu (||ĕkka||) adivo saṁdrodaya madivo rohiṇibŏddu adana śhrīkṛṣhṇum̐ḍaṁdĕ navadāramu gadayu śhaṁkhasakrālu gala nālugusedula nĕdiriṁchi yunnām̐ḍu idivo bālum̐ḍu (||ĕkka||) vasudevum̐ḍalla vām̐ḍe varusa devagi yade kŏsare brahmādula kŏṁḍāḍa made pŏsam̐gam̐ bŏttulaviూdam̐ burum̐ṭiṁṭi lobala śhisuvai mahima sūbĕ śhrīkṛṣhṇum̐ḍu (||ĕkka||) paraṁjyodirūba midĕ pāṁḍavula bradigiṁchĕ aridi kauravulasaṁhāramū nidĕ harigarghyamu līro jayaṁti paṁḍuga seyarŏ kĕrali śhrīveṁkaḍādri kṛṣhṇum̐ḍidam̐ḍu