Title (Indic)ఎగసక్కేలే సేసీ నిదే మీతఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎగసక్కేలే సేసీ నిదే మీతఁడు నగవు వచ్చీఁ దన నాఁటకములకును (॥॥) కోరి నేఁ గానుకిచ్చిన గొప్పతమ్మిపువ్వందుక వేరొకతెచన్ను దాఁ కవేసీనే తాను సారెకు నెవ్వతో మేనిజవ్వాదిపై వడిసితే మేరమీరి యది నా మేనఁ దుడిచీనే (॥॥) చేతికిచ్చినవిడెము సేసి పుక్కిటఁ బెట్టుక కాతరానఁ బెట్టీఁ దమ్మకడఁ దానికి రాతిరెల్లా జాగారాలు రతి నెందోసేసి వచ్చి యీతల నిద్రించీ మాయింటిలోనను (॥॥) అద్దమునాచేఁ దెప్పించి యండనున్నసతిమోము నిద్దమై తనమోమునీడ చూచీనే అద్దుక శ్రీవేంకటేశుఁ డల్లాకెమేనిగందము ఉద్దండాన నాకాఁగిట నొనర నంటించీనే English(||pallavi||) ĕgasakkele sesī nide mīdam̐ḍu nagavu vachchīm̐ dana nām̐ṭagamulagunu (||||) kori nem̐ gānugichchina gŏppadammibuvvaṁduga verŏgadĕsannu dām̐ kavesīne tānu sārĕgu nĕvvado menijavvādibai vaḍiside meramīri yadi nā menam̐ duḍisīne (||||) sedigichchinaviḍĕmu sesi pukkiḍam̐ bĕṭṭuga kādarānam̐ bĕṭṭīm̐ dammagaḍam̐ dānigi rādirĕllā jāgārālu radi nĕṁdosesi vachchi yīdala nidriṁchī māyiṁṭilonanu (||||) addamunāsem̐ dĕppiṁchi yaṁḍanunnasadimomu niddamai tanamomunīḍa sūsīne adduga śhrīveṁkaḍeśhum̐ ḍallāgĕmenigaṁdamu uddaṁḍāna nāgām̐giḍa nŏnara naṁṭiṁchīne