Title (Indic)ఈడకుఁ బిలువవయ్యా యిన్నియు నడుగుదము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఈడకుఁ బిలువవయ్యా యిన్నియు నడుగుదము జోడుగూడినట్టి తన సుద్దులెల్లాఁ గంటిమి (॥॥) సెలవుల నవ్వీ నాపె సిగ్గులువడీ నాపె పొలఁతికి నీకు దొల్లి పొందుగలదో తలపించీ మాటలు తప్పక నీ మోము చూచీ యెలమిఁ గలికితనా లెంత నేరిచినది (॥॥) కనుసన్న సేసీ నాపె కానుకలిచ్చీ నాపె చనవిచ్చితివో యింత సతికి నీవు వొనరించీఁ బ్రియములు వూడిగేలు సేయవచ్చీ తనలోనె యెంతేసి కతలఁ గఱచినది (॥॥) చేతులు చాఁచీ నాపె చేరి కాఁగిలించీ నాపె యీతరుణి నిల్లాలిఁగా నేలుకొంటివో యేతుల శ్రీవేంకటేశ యెనసితివిటు నన్ను గాతలఁ దానెంత నీతోఁ గడు జాణైనది English(||pallavi||) īḍagum̐ biluvavayyā yinniyu naḍugudamu joḍugūḍinaṭṭi tana suddulĕllām̐ gaṁṭimi (||||) sĕlavula navvī nābĕ sigguluvaḍī nābĕ pŏlam̐tigi nīgu dŏlli pŏṁdugalado talabiṁchī māḍalu tappaga nī momu sūsī yĕlamim̐ galigidanā lĕṁta nerisinadi (||||) kanusanna sesī nābĕ kānugalichchī nābĕ sanavichchidivo yiṁta sadigi nīvu vŏnariṁchīm̐ briyamulu vūḍigelu seyavachchī tanalonĕ yĕṁtesi kadalam̐ gaṟasinadi (||||) sedulu sām̐sī nābĕ seri kām̐giliṁchī nābĕ yīdaruṇi nillālim̐gā nelugŏṁṭivo yedula śhrīveṁkaḍeśha yĕnasidiviḍu nannu gādalam̐ dānĕṁta nīdom̐ gaḍu jāṇainadi