Title (Indic)దేవకామిను లాడరో దివ్యదుందుభులు మ్రోసే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దేవకామిను లాడరో దివ్యదుందుభులు మ్రోసే దేవుఁడు కోనేటిదండఁ దిరువీధి మెరసే (॥॥) యెత్తిరి గరుడధ్వజ మిందిరాపతి పెండ్లికి యిత్తల సురలు మును లిందరూ రారో హత్తి సేనాపతి యిచ్చె నదె కప్పురవిడేలు చిత్తగించి యాగసాల చేరె హనుమంతుఁ డు (॥॥) కట్టిరి కలువడాలు కమలాపతి పెండ్లికి యిట్టే పేరటాండ్లు నేఁ డిందరూ రారో చుట్టి చుట్టి రక్షగాను సుదర్శనము మించి కట్ట లై తిరువాముడి ఘనులు వాడేరు (॥॥) వెలయ భాష్యకారులు విందుచెప్పెఁ బెండ్లికి నెలవై బువ్వాలవారు నెమ్మది రారో అలమి శ్రీ వేంకటేశుఁ డలమేలుమంగఁ గూడె వెలసేరు పెండ్లి చవికెలోన నదివో. English(||pallavi||) devagāminu lāḍaro divyaduṁdubhulu mrose devum̐ḍu koneḍidaṁḍam̐ diruvīdhi mĕrase (||||) yĕttiri garuḍadhvaja miṁdirābadi pĕṁḍligi yittala suralu munu liṁdarū rāro hatti senābadi yichchĕ nadĕ kappuraviḍelu sittagiṁchi yāgasāla serĕ hanumaṁtum̐ ḍu (||||) kaṭṭiri kaluvaḍālu kamalābadi pĕṁḍligi yiṭṭe peraḍāṁḍlu nem̐ ḍiṁdarū rāro suṭṭi suṭṭi rakṣhagānu sudarśhanamu miṁchi kaṭṭa lai tiruvāmuḍi ghanulu vāḍeru (||||) vĕlaya bhāṣhyagārulu viṁdusĕppĕm̐ bĕṁḍligi nĕlavai buvvālavāru nĕmmadi rāro alami śhrī veṁkaḍeśhum̐ ḍalamelumaṁgam̐ gūḍĕ vĕlaseru pĕṁḍli savigĕlona nadivo.