Title (Indic)ఔ నౌ మరి ఆఁడువార మంత కోపము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఔ నౌ మరి ఆఁడువార మంత కోపము ఆనతిమ్మా నీకు నితవైనట్టే సేసేను (॥ఔనౌ॥) సారె సారె నీతోను సణఁగులు చూపఁగాను భారము గాదుగదా పంతగాఁడవు కూరిమి గలిగి నేను గొణుఁగుచుఁ దిట్టఁగాను వైరముగాదుగదా వాసికాఁడవు (॥ఔనౌ॥) కప్పినట్టి నీమోవిగంట్లిట్టె రేఁచఁగాను నొప్పులు గావుగదా నుడికారివి చిప్పిల నింటికి నీవు చేయివట్టి తియ్యగాను దప్పులు గొనవుగదా తమకపుదొరవు (॥ఔనౌ॥) కాలుమీఁద గాలువేసి కరఁగించి కూడఁగాను నాలితో మొక్కవుగదా నాఁటకీఁడవు యీలీల శ్రీవేంకటేశ ఇట్టె నన్నుఁ గూడితివి వేళలు గావవుగదా వేడుకకాఁడవు English(||pallavi||) au nau mari ām̐ḍuvāra maṁta kobamu ānadimmā nīgu nidavainaṭṭe sesenu (||aunau||) sārĕ sārĕ nīdonu saṇam̐gulu sūbam̐gānu bhāramu gādugadā paṁtagām̐ḍavu kūrimi galigi nenu gŏṇum̐gusum̐ diṭṭam̐gānu vairamugādugadā vāsigām̐ḍavu (||aunau||) kappinaṭṭi nīmovigaṁṭliṭṭĕ rem̐sam̐gānu nŏppulu gāvugadā nuḍigārivi sippila niṁṭigi nīvu seyivaṭṭi tiyyagānu dappulu gŏnavugadā tamagabudŏravu (||aunau||) kālumīm̐da gāluvesi karam̐giṁchi kūḍam̐gānu nālido mŏkkavugadā nām̐ṭagīm̐ḍavu yīlīla śhrīveṁkaḍeśha iṭṭĕ nannum̐ gūḍidivi veḽalu gāvavugadā veḍugagām̐ḍavu