Title (Indic)అప్పటనుండి నాకు నందుకే వేఁడుకోఁబట్టె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అప్పటనుండి నాకు నందుకే వేఁడుకోఁబట్టె ముప్పిరి వేవేలకును మొక్కేఁ జుమ్మీ నేను (॥అప్ప॥) మేలమాడేవేళ నిన్ను మీరి నే నేమంటినో బేలనై నీతో నెంత పెనఁగితినో చేలికొంగు నీవంటఁగా చెయ్యేడఁ దాఁకించితినో కేలెత్తి నీకిదివో మొక్కేఁ జుమ్మీ నేను (॥అప్ప॥) నీ కూడిగము సేయఁగా నిన్నఁ గా లేడ సోఁకెనో ఆకుమడిచియ్యఁగా నిన్నంటెనో గోరు దాకొని నీతో నవ్వఁగా తమ్ముల మేడఁజిందెనో యీకడ మొక్కేఁ జుమ్మీ యెరఁగను నేను (॥అప్ప॥) చెనకి కాఁగిలించఁగా చెమ టెంత వడిసెనో యెనయఁగా నీ చన్ను లెంత వొత్తెనో నిను, శ్రీవేంకటేశఁడ నేఁ జేసిన చేఁతకెల్లా మునుపనే వినయాన మొక్కేఁ జుమ్మీ నేను English(||pallavi||) appaḍanuṁḍi nāgu naṁduge vem̐ḍugom̐baṭṭĕ muppiri vevelagunu mŏkkem̐ jummī nenu (||appa||) melamāḍeveḽa ninnu mīri ne nemaṁṭino belanai nīdo nĕṁta pĕnam̐gidino seligŏṁgu nīvaṁṭam̐gā sĕyyeḍam̐ dām̐kiṁchidino kelĕtti nīgidivo mŏkkem̐ jummī nenu (||appa||) nī kūḍigamu seyam̐gā ninnam̐ gā leḍa som̐kĕno āgumaḍisiyyam̐gā ninnaṁṭĕno goru dāgŏni nīdo navvam̐gā tammula meḍam̐jiṁdĕno yīgaḍa mŏkkem̐ jummī yĕram̐ganu nenu (||appa||) sĕnagi kām̐giliṁcham̐gā sĕma ṭĕṁta vaḍisĕno yĕnayam̐gā nī sannu lĕṁta vŏttĕno ninu, śhrīveṁkaḍeśham̐ḍa nem̐ jesina sem̐tagĕllā munubane vinayāna mŏkkem̐ jummī nenu