Title (Indic)అన్నిటా దొరవయితే నౌదువుగాని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అన్నిటా దొరవయితే నౌదువుగాని విన్నవించితి నిప్పుడే వెలఁది చందములు (॥అన్ని॥) సిగ్గరిపెండ్లికూఁతురు సేసవెట్టీ నిదె నీకు వొగ్గి తలవంచవయ్యా వొద్దికతోను కగ్గులేక యప్పటి నీకాలు దొక్కీ వేడుకతో యెగ్గులు వట్టేవుసుమ్మీ యిందుకుఁగాను (॥అన్ని॥) కలికి నీ మరఁదలు కంకణము గట్టీ నీకు లలిఁ జేయి చాఁచవయ్యా లాలనతోను యెలయించి సన్నలనే యెంగిలిమోవి చూపీని మలసి దూరేవుసుమ్మీ మన్నింతువు గాని (॥అన్ని॥) దేవు లలమేలుమంగ తెరదీసి చెనకీని సేవ సేయించుకోవయ్యా శ్రీవేంకటేశ వోవరిలోనికి దీసి వురమెక్కీ నింతలోనె యేవేళా దించేవుసుమ్మీ యిట్టె వుందువుగాని English(||pallavi||) anniḍā dŏravayide nauduvugāni vinnaviṁchidi nippuḍe vĕlam̐di saṁdamulu (||anni||) siggaribĕṁḍligūm̐turu sesavĕṭṭī nidĕ nīgu vŏggi talavaṁchavayyā vŏddigadonu kaggulega yappaḍi nīgālu dŏkkī veḍugado yĕggulu vaṭṭevusummī yiṁdugum̐gānu (||anni||) kaligi nī maram̐dalu kaṁkaṇamu gaṭṭī nīgu lalim̐ jeyi sām̐savayyā lālanadonu yĕlayiṁchi sannalane yĕṁgilimovi sūbīni malasi dūrevusummī manniṁtuvu gāni (||anni||) devu lalamelumaṁga tĕradīsi sĕnagīni seva seyiṁchugovayyā śhrīveṁkaḍeśha vovarilonigi dīsi vuramĕkkī niṁtalonĕ yeveḽā diṁchevusummī yiṭṭĕ vuṁduvugāni