Title (Indic)అన్ని సుద్దులు నెరుఁగు నాతఁడే కాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అన్ని సుద్దులు నెరుఁగు నాతఁడే కాక యెన్నికలు పలుమారు యే మెంచేనే నేను (॥అన్ని॥) నివ్వెరగు వడి యుండి నే నే మనే నిన్ను నవ్వలిమాటలు నన్ను నడుగ నేలా దవ్వులఁ దనచేఁతుల తలపోయుచున్నదాన యెవ్వరిమాటల కని యే మందు నేను (॥అన్ని॥) చెక్కుచేత నే నుండి నేనే దేమే నిన్ను తక్కక నన్నేల మీరు తడవేరే మొక్కలోన నాతనిమోము చూచె నిదే నేను యెక్కువ తక్కువలకు నెంతదాన నేనూ (॥అన్ని॥) కలకల నవ్వుతాను కా దనే దేమే నిన్ను చలపట్టి వల పేల చల్లు మనేరే యెలమి శ్రీవెంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె యిల నాకు నెదు రేదే యిర వయితి నేనూ English(||pallavi||) anni suddulu nĕrum̐gu nādam̐ḍe kāga yĕnnigalu palumāru ye mĕṁchene nenu (||anni||) nivvĕragu vaḍi yuṁḍi ne ne mane ninnu navvalimāḍalu nannu naḍuga nelā davvulam̐ danasem̐tula talaboyusunnadāna yĕvvarimāḍala kani ye maṁdu nenu (||anni||) sĕkkuseda ne nuṁḍi nene deme ninnu takkaga nannela mīru taḍavere mŏkkalona nādanimomu sūsĕ nide nenu yĕkkuva takkuvalagu nĕṁtadāna nenū (||anni||) kalagala navvudānu kā dane deme ninnu salabaṭṭi vala pela sallu manere yĕlami śhrīvĕṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐ gūḍĕ yila nāgu nĕdu rede yira vayidi nenū