Title (Indic)అంతెకాదా వుప్పు వేసి అట్టె పొత్తు గలసేవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అంతెకాదా వుప్పు వేసి అట్టె పొత్తు గలసేవు వింతలాయ నీవు నొక వినోదకత్తెవు (॥అంతె॥) వారక నాయిల్లు చొచ్చి వచ్చి రమణునితోడ సారెకు నవ్వే వౌనే జాణకత్తెవు కూరిమి నామంచముపైఁ గూచుండఁగా విడెము తారి తారి యిచ్చేవేమే తాలిమికత్తెవు (॥అంతె॥) మగని నే దూరితేను మరి పూసుక వచ్చేవు జిగి నీవు గలితిగా చెలికత్తెవు పగటున నాకాఁగిటి సతిపాదాలు గుద్దేవు వెగటులే కిపుడైతివే వూడిగకత్తెవు (॥అంతె॥) అలమేలుమంగ నేను అతఁడు శ్రీవేంకటేశుఁ డెలమి నవ్వులు నవ్వే వెమ్మెకత్తెవు కలసె నాతఁడు నన్ను కాంతుని నీవూఁ గూడేవు తెలిసితి నీగుణము తేరకత్తెవు English(||pallavi||) aṁtĕgādā vuppu vesi aṭṭĕ pŏttu galasevu viṁtalāya nīvu nŏga vinodagattĕvu (||aṁtĕ||) vāraga nāyillu sŏchchi vachchi ramaṇunidoḍa sārĕgu navve vaune jāṇagattĕvu kūrimi nāmaṁchamubaim̐ gūsuṁḍam̐gā viḍĕmu tāri tāri yichcheveme tālimigattĕvu (||aṁtĕ||) magani ne dūridenu mari pūsuga vachchevu jigi nīvu galidigā sĕligattĕvu pagaḍuna nāgām̐giḍi sadibādālu guddevu vĕgaḍule kibuḍaidive vūḍigagattĕvu (||aṁtĕ||) alamelumaṁga nenu adam̐ḍu śhrīveṁkaḍeśhum̐ ḍĕlami navvulu navve vĕmmĕgattĕvu kalasĕ nādam̐ḍu nannu kāṁtuni nīvūm̐ gūḍevu tĕlisidi nīguṇamu teragattĕvu