Title (Indic)అందులోనే వున్నవివె అన్ని విన్నపములును WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అందులోనే వున్నవివె అన్ని విన్నపములును కందువతోడఁ గలసీ కరుణించవయ్యా (॥॥) చెక్కులపై వెడజారుఁజెమట నీపచ్చడాన గక్కనఁ దుడుచుకొనీఁ గామిని వెక్కసపుఁ గుచముల వెట్ట దీర నీ చేతుల అక్కరతో నద్దుకొనీ నప్పటప్పటికిని (॥॥) ఆలయిక లెల్లాఁ దీర నండ నున్న నీమీఁద పలుమారు నొరగీని పడఁతి నిలువుఁగొప్పు వీడితే నిన్నే ముడువుమనీ తలఁపించి విరహపుతమకముతోడను (॥॥) తెల్లమిగాఁ దనదప్పి దేరుచుకొని మోవి మెల్లనే చేకొనీ నలమేలుమంగ చెల్లుబడి నీకాఁగిట శ్రీవేంకటేశుఁడు గూడి యిల్లిదే నిన్నుఁ బొగడి యిచ్చకమాడీని English(||pallavi||) aṁdulone vunnavivĕ anni vinnabamulunu kaṁduvadoḍam̐ galasī karuṇiṁchavayyā (||||) sĕkkulabai vĕḍajārum̐jĕmaḍa nībachchaḍāna gakkanam̐ duḍusugŏnīm̐ gāmini vĕkkasabum̐ gusamula vĕṭṭa dīra nī sedula akkarado naddugŏnī nappaḍappaḍigini (||||) ālayiga lĕllām̐ dīra naṁḍa nunna nīmīm̐da palumāru nŏragīni paḍam̐ti niluvum̐gŏppu vīḍide ninne muḍuvumanī talam̐piṁchi virahabudamagamudoḍanu (||||) tĕllamigām̐ danadappi derusugŏni movi mĕllane segŏnī nalamelumaṁga sĕllubaḍi nīgām̐giḍa śhrīveṁkaḍeśhum̐ḍu gūḍi yillide ninnum̐ bŏgaḍi yichchagamāḍīni