Title (Indic)అడిగినాఁ జెప్పదు అంగన తనచేఁతలు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అడిగినాఁ జెప్పదు అంగన తనచేఁతలు సుడిగొనీ వలపులఁ జూడరమ్మా (॥అడి॥) చెక్కునఁబెట్టినచేయిచిరుఁజెమటనొసలు చుక్కలు గాసేటి మోవి చూడరామ్మా జక్కువ చన్నులమీఁద జారిన పయ్యెదకొంగు చొక్కవుకళలమోము చూడరమ్మా (॥అడి॥) నెరులు చెదరుఁ గొప్పు విరులు రాలేటి చొప్పు సొరిది లేఁతనవ్వులు చూడరమ్మా గరమతోడఁ జిట్లుగందాల ముంజేతి సురతపు సింగారాలు చూడరమ్మ (॥అడి॥) పెనఁగే హారాలు మెడ ప్రేమఁ జొక్కేఁటి తనువు జునిఁగే శిరసు వంపు చూడరమ్మా యెనసె శ్రీవేంకటేశుఁ డిందాఁకాఁ దను రతుల చొనిపీ నేరుపులెల్లాఁ జూడరమ్మా English(||pallavi||) aḍiginām̐ jĕppadu aṁgana tanasem̐talu suḍigŏnī valabulam̐ jūḍarammā (||aḍi||) sĕkkunam̐bĕṭṭinaseyisirum̐jĕmaḍanŏsalu sukkalu gāseḍi movi sūḍarāmmā jakkuva sannulamīm̐da jārina payyĕdagŏṁgu sŏkkavugaḽalamomu sūḍarammā (||aḍi||) nĕrulu sĕdarum̐ gŏppu virulu rāleḍi sŏppu sŏridi lem̐tanavvulu sūḍarammā garamadoḍam̐ jiṭlugaṁdāla muṁjedi suradabu siṁgārālu sūḍaramma (||aḍi||) pĕnam̐ge hārālu mĕḍa premam̐ jŏkkem̐ṭi tanuvu junim̐ge śhirasu vaṁpu sūḍarammā yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁdām̐kām̐ danu radula sŏnibī nerubulĕllām̐ jūḍarammā