Title (Indic)ఆయనయ్య నీ ప్రియములన్నియు వచ్చెను మాకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆయనయ్య నీ ప్రియములన్నియు వచ్చెను మాకు చేయి మీఁదాయ సేవలు సేసేమయ్య నీకును (॥॥) ఆనవెట్ట నేఁటికి నీవంతేసి నాతోను కానవచ్చీని రేపల్లెకాడ నీ గుట్టు వీనులెల్లఁ జిల్లులాయ విని విని నీకతలు వూనిన నామనసెట్టు వొడఁబడీ నిఁకను (॥॥) సాకిరి చూప నేఁటికి సారెసారె నాముందర జోకలు కొలనికాడఁ జూచేమన్నియు చీకాకుపడెను నాచిత్తము నీమేను చూచి యీకడ నిఁకనట్ల యియ్యకొందు నిజము (॥॥) చెక్కు నొక్కనేమిటికి చెలఁగని నీపొందు తొక్కిన నీరతిలోనే తోఁచీ మాకు గక్కన శ్రీవేంకటేశ కలసి నే బ్రమసితి వెక్కసాలెట్ల నాడే వేవేలు నిన్నును English(||pallavi||) āyanayya nī priyamulanniyu vachchĕnu māgu seyi mīm̐dāya sevalu sesemayya nīgunu (||||) ānavĕṭṭa nem̐ṭigi nīvaṁtesi nādonu kānavachchīni reballĕgāḍa nī guṭṭu vīnulĕllam̐ jillulāya vini vini nīgadalu vūnina nāmanasĕṭṭu vŏḍam̐baḍī nim̐kanu (||||) sāgiri sūba nem̐ṭigi sārĕsārĕ nāmuṁdara jogalu kŏlanigāḍam̐ jūsemanniyu sīgāgubaḍĕnu nāsittamu nīmenu sūsi yīgaḍa nim̐kanaṭla yiyyagŏṁdu nijamu (||||) sĕkku nŏkkanemiḍigi sĕlam̐gani nībŏṁdu tŏkkina nīradilone tom̐sī māgu gakkana śhrīveṁkaḍeśha kalasi ne bramasidi vĕkkasālĕṭla nāḍe vevelu ninnunu