పల్లవి:
ఏందమ్మో ఇలాగుంది... ఏదేదో అయ్యేట్టుంది
అయోమయంగా ఉందే అయ్యయ్యయ్యయ్యో
అదీ హాయిగా ఉందే అయ్యయ్యయ్యయ్యో
ప్రేమయ్యిందో ఏమయ్యిందో అయ్యయ్యయ్యయ్యో..ఓ..ఓ..ఓ...
ఏందయ్యో ఇలాగుంది... ఏదేదో అయ్యేట్టుంది
అయోమయంగా ఉందే అయ్యయ్యయ్యయ్యో
అదీ హాయిగా ఉందే అయ్యయ్యయ్యయ్యో
ప్రేమయ్యిందో ఏమయ్యిందో అయ్యయ్యయ్యయ్యో..ఓ..
ఏందమ్మో ఇలాగుంది... ఏదేదో అయ్యేట్టుంది
చరణం 1:
కోతిని చూస్తున్నా అందంగానే కనబడుతుంది ఎందుకో
కాకులు కూస్తున్నా సంగీతంలా వినబడుతోంది ఏవిటో
నీతో ఉంటే చేపల కంపే పువ్వుల తోటల్లే ఉందే
పోలీస్ అయినా దేవుడి గుళ్ళో పూజారల్లే ఉన్నాడే
అంతా తలకిందైపోయిందే అయ్యయ్యయ్యయ్యో..ఓ..
ఏందమ్మో ఇలాగుంది... ఏదేదో అయ్యేట్టుంది
ఏంటో చెప్పరాదా
చరణం 2:
గడియారాలన్నీ కదలను మొర్రో అంటున్నాయే కొత్తగా
ఇంకా కీ ఇస్తే వెనకకి సైతం వెళ్తున్నాయే వింతగా
ఏమైతేనేం వాటం చూస్తే కొంపలు ముంచేటట్టుంది
ఏం చేస్తాంలే ప్రేమంటేనే కొంచెం పైత్యం ఉంటుంది
మనలో మాయో మన్మథ మాయో అయ్యయ్యయ్యయ్యో..ఓ..ఓ..ఓ..
ఏందమ్మో ఇలాగుంది... అరె ఏదేదో అయ్యేట్టుంది
అయోమయంగా ఉందే అయ్యయ్యయ్యయ్యో
అదీ హాయిగా ఉందే అయ్యయ్యయ్యయ్యో
ప్రేమయ్యిందో ఏమయ్యిందో అయ్యయ్యయ్యయ్యో..ఓ..ఓ..ఓ...
ఏందయ్యో ఇలాగుంది... ఏదేదో అయ్యేట్టుంది